IND vs SA : రాయ్‌పూర్‌లో టీమిండియాకు ఘోర పరాజయం..కోహ్లీ-రుతురాజ్ సెంచరీలు వృథా
వన్డే క్రికెట్‌లో ఒక జట్టు 358 పరుగులు చేస్తే, ఆ మ్యాచ్‌లో గెలుపు ఖాయమని భావిస్తారు. కానీ రాయ్‌పూర్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు మాత్రం ఆశ్చర్యకరమైన పరాజయం ఎదురైంది.
IND vs SA : రాయ్‌పూర్‌లో టీమిండియాకు ఘోర పరాజయం..కోహ్లీ-రుతురాజ్ సెంచరీలు వృథా
IND vs SA: వన్డే క్రికెట్‌లో ఒక జట్టు 358 పరుగులు చేస్తే, ఆ మ్యాచ్‌లో గెలుపు ఖాయమని భావిస్తారు. కానీ రాయ్‌పూర్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు మాత్రం ఆశ్చర్యకరమైన పరాజయం ఎదురైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడినా, భారత జట్టు చేసిన కొన్ని పెద్ద తప్పులే ఈ అనూహ్య ఓటమికి దారితీశాయి.
1. టాస్, డ్యూ ఫ్యాక్టర్
భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి టాస్, మంచు ప్రభావం. దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనికి కారణం రాయ్‌పూర్ వాతావరణమే. సాయంత్రం వేళల్లో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. దీని వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు బంతిపై పట్టు దొరకక, బ్యాటింగ్‌కు చాలా సులభమైంది. ఈ డ్యూ ఫ్యాక్టర్ దక్షిణాఫ్రికాకు 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బాగా కలిసొచ్చింది.
2. డెత్ ఓవర్లలో నెమ్మదైన బ్యాటింగ్
భారత్ 358 పరుగులు సాధించినా, ఆఖరి పది ఓవర్లలో బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. ఆఖరి 60 బంతుల్లో భారత జట్టు కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్ (66 నాటౌట్) అద్భుతంగా ఆడినా, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్‌మెన్‌తో కలిసి డెత్ ఓవర్లలో మరింత వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఒకవేళ చివరి పది ఓవర్లలో మరో 15-20 పరుగులు అదనంగా చేసి ఉంటే, భారత్ స్కోరు 375 దాటేది. ఆ స్కోరు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచేది.
3. బౌలర్ల దారుణ ప్రదర్శన
దక్షిణాఫ్రికా విజయంలో భారత బౌలర్ల వైఫల్యం కూడా ప్రధాన పాత్ర పోషించింది. పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తన 8 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీసినా, పరుగుల నియంత్రణ లేదు. అలాగే, స్పిన్నర్ కులదీప్ యాదవ్ కూడా 10 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి భారీగా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. బౌలర్లు ఇంత ఎక్కువ పరుగులు ఇవ్వడం వల్లే దక్షిణాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలిగింది.
4. యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ తప్పిదం
భారత్ ఓటమికి అతిపెద్ద మలుపు, యశస్వి జైస్వాల్ చేసిన ఫీల్డింగ్ తప్పిదమే. దక్షిణాఫ్రికా వైస్-కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కేవలం 53 పరుగులు వద్ద ఉన్నప్పుడు, జైస్వాల్ ఒక సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్ లైన్ మార్క్రమ్‌కు లభించడంతో, అతను ఏమాత్రం వెనుకాడకుండా సెంచరీ (110 పరుగులు) చేసి, జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ఒక్క క్యాచ్‌ను పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.
5. పేలవమైన గ్రౌండ్ ఫీల్డింగ్
గ్రౌండ్ ఫీల్డింగ్‌లోనూ భారత జట్టు నిరాశపరిచింది. అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ వంటి క్రీడాకారులు పదే పదే మిస్‌ఫీల్డ్స్ చేశారు. దాదాపు 3-4 సార్లు ఓవర్ థ్రోల ద్వారా అనవసరపు పరుగులను ప్రత్యర్థికి అందించారు. ఇలాంటి హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో చేసిన చిన్న చిన్న తప్పులు కూడా మొత్తం మ్యాచ్‌ను ప్రభావితం చేస్తాయి.