TOP 6 News @ 6PM: వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు.. హడావుడిగా హైదరాబాద్‌కు దీపాదాస్ మున్షి

Update: 2025-02-05 12:43 GMT

హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

1) ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.7 % ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్లు ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇంకొద్దిసేపట్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఢిల్లీ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్న వారి దృష్టి ఇప్పుడు రాబోయే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయా అనేదానిపైనే ఉంది.

2) గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. ప్రకటించిన సీఎం రేవంత్‌

భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి నజరానా ప్రకటించారు. జూబ్లిహిల్స్‌లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన త్రిషను సీఎం అభినందించారు. త్రిష భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. మరో క్రికెటర్ ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. ఇక టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం నుంచి ఆల్ రౌండ్ ప్రదర్శనతో త్రిష అదరగొట్టారు. టీమ్ ఇండియా కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు.

3) హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి కూడా పాల్గొనున్నారు. జనవరి 31న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఎనిమిది మంది మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఎమ్మెల్యేల భేటీ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది. ఇద్దరు మంత్రులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమావేశం వెనుక మరో మంత్రి హస్తం ఉందనే ప్రచారం సాగింది.

అయితే ఈ విషయాలపై స్పష్టత లేకపోయినా ఎమ్మెల్యేల సమావేశం మాత్రం వాస్తవమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షికి తమ అభిప్రాయాలను చెబుతామని ఆయన మీడియాకు చెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) PM Modi At Maha Kumbh: పుణ్యస్నానం చేసిన మోదీ

PM Modi At Maha Kumbh: నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లో బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. మహాకుంభమేళాను పురస్కరించుకొని ప్రధాని ఇవాళ ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు ఆయన బోట్ లో ప్రయాణించారు. ఆ తర్వాత పుణ్యస్నానం చేశారు. భీష్మ అష్టమి రోజున మహాకుంభమేళాకు మోదీ హాజరయ్యారు. ప్రదాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం పార్లమెంట్ కు సెలవు ఇచ్చారు. దీంతో మోదీ మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి వచ్చారు. పుణ్యస్నానం చేసిన తర్వాత యూపీలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన తిరిగి దిల్లీకి వెళ్తారు.

మంగళవారం నాడు భూటాన్ రోజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్ చుక్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. ఆయనకు యూపీ సీఎం స్వాగతం పలికారు. మహాకుంభమేళాలో జనవరి 29న తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి . ఇదే విషయమై పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న విపక్షాలు ఆందోళనకు దిగాయి.

5) Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవల్లో దుమ్ము రేపుతుంది.. ఏ.ఎం. రత్నం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఎ.ఎం. రత్నం ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ను అలరించడం పక్కా అని అని అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఏ.ఎం. రత్నం చేసిన ఈ వ్యాఖ్యలతో హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడున్న హైప్ కంటే మరిన్ని రెట్లు పెరిగింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Mastan Sai: లావణ్య హత్యకు మస్తాన్‌ సాయి ప్లాన్‌.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Mastan Sai: యువతుల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

మస్తాన్ సాయితో పాటు ఆర్ జే శేఖర్ బాషాపై మన్నెపల్లి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, ఆర్ జే శేఖర్ ఎందుకు ప్రయత్నించారు? లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి ఏమంటున్నారో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News