Mastan Sai: లావణ్య హత్యకు మస్తాన్‌ సాయి ప్లాన్‌.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Mastan Sai: లావణ్య హత్యకు మస్తాన్‌ సాయి ప్లాన్‌.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు
x
Highlights

Mastan Sai: యువతుల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు.

Mastan Sai: యువతుల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. మస్తాన్ సాయితో పాటు ఆర్ జే శేఖర్ బాషాపై మన్నెపల్లి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, ఆర్ జే శేఖర్ ఎందుకు ప్రయత్నించారు? లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి ఏమంటున్నారో తెలుసుకుందాం.

మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు

రావి మస్తాన్ సాయిపై లావణ్య ఫిబ్రవరి 2న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుతో పాటు ఓ హార్డ్ డిస్క్ ను కూడ ఆమె పోలీసులకు అందించారు. ఈ హార్క్ డిస్క్ లో మహిళలకు చెందిన ఫోటోలు, వీడియోలున్నాయని ఆమె తెలిపారు. ఈ హర్డ్ డిస్క్ కోసం తనపై దాడి చేసేందుకు తన ఇంటికి వచ్చారని మస్తాన్ సాయి, ఖాజాపై ఆమె ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా మస్తాన్ సాయి, ఖాజాలపై బీఎన్ఎస్ 329(4),324(4),109,77,78 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 4న మస్తాన్ సాయితో పాటు ఖాజాను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.ఉనీత్ రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. ఓ ఫంక్షన్ సందర్బంగా మస్తాన్ సాయి ఇంటికి వెళ్లింది లావణ్య. ఆ సమయంలో ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశారు. ఈ వీడియోలను తన ఫ్రెండ్స్ కు కూడా అతను షేర్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. దీంతో లావణ్య మస్తాన్ సాయితో గొడవకు దిగింది. ఈ విషయాన్ని అప్పట్లో రాజ్ తరుణ్ రాజీ చేశారని పోలీసులు తెలిపారు. మస్తాన్ సాయి వద్ద ఉన్న ఐపాడ్ లో ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. అయితే అప్పటికే ఆ వీడియోలను మస్తాన్ మరొక హార్డ్ డిస్క్ లో భద్రపర్చారు.ఈ హర్డ్ డిస్క్ ను 2024 నవంబర్ లో లావణ్య మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ హర్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి లావణ్యను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయని పోలీసులు ఆ రిపోర్టులో తెలిపారు.

మస్తాన్ సాయి వాదన ఏంటి?

లావణ్య పోలీసులకు ఇచ్చిన హర్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలకు సంబంధించి మస్తాన్ సాయిని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోల గురించి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. తనను లావణ్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.ఫిబ్రవరి 4న శేఖర్ భాషాపై కూడా లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి ఆయన కూడా ప్రయత్నించారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ వాదనను శేఖర్ భాషా తోసిపుచ్చారు. లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

తన మాదిరిగా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య చెబుతున్నారు. లావణ్య ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని భావిస్తున్నారు. దీని కోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories