Lok Sabha: లోక్‌సభలో సంచలనం: ప్రధాని మోదీపై దాడికి కుట్ర..? అందుకే సభ వాయిదా పడిందా!
Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే ఆమోదం తెలపడం వెనుక సంచలన కారణాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రధానిపై దాడికి ప్లాన్?
సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించినట్లు తమకు పక్కా సమాచారం అందిందని లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి. ఈ ముందస్తు సమాచారం అందడంతోనే, భద్రతా కారణాల దృష్ట్యా స్పీకర్ నిన్న సభను అర్థాంతరంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి తీర్మానాలపై ప్రధాని సమాధానం చెప్పడం ఆనవాయితీ అయినప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రధాని ప్రసంగం లేకుండానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.