Lok Sabha: లోక్‌సభలో అరుదైన దృశ్యం: 22 ఏళ్ల తర్వాత ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఒక అరుదైన పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-02-05 08:55 GMT

Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఒక అరుదైన పరిణామం చోటుచేసుకుంది. విపక్షాల తీవ్ర ఆందోళనలు, నిరసనల మధ్యే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. అయితే, బుధవారం సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లేకుండానే స్పీకర్ ఓటింగ్ నిర్వహించి తీర్మానాన్ని ఆమోదించారు.

22 ఏళ్ల తర్వాత పునరావృతం:

భారత పార్లమెంటరీ చరిత్రలో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ఆమోదం లభించడం గత 22 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం లేకుండానే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బుధవారం విపక్షాల నిరసనల కారణంగా ప్రధాని ప్రసంగానికి ముందే సభ వాయిదా పడటంతో, చర్చను ముగించి తీర్మానాన్ని పాస్ చేసినట్లు ప్రకటించారు.

Tags:    

Similar News