Janata Curfew Live Updates : కరోనా వైరస్ పై యద్ధం!

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలు స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయారు. ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలందరూ స్వచ్చందంగా మద్దతు పలికారు.. జనతా కర్ఫ్యూ లైవ్ అప్డేట్స్..

Update: 2020-03-22 01:13 GMT
Prime Minister Modi addressing people on Janata Curfew (file Photo)


Live Updates
2020-03-22 13:51 GMT

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.- పూర్తి కథనం  

2020-03-22 13:50 GMT

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది.- పూర్తి కథనం  

2020-03-22 09:04 GMT

కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిస్తే, సంగారెడ్డిలోని ఓ కౌన్సిలర్ మత అహంకారంతో ఊగిపోయాడు. అహంకారంతో ఊగిపోయిన 34వ వార్డ్ కౌన్సిలర్ షమీ.. జనతా కర్ఫ్యూను పట్టించుకోవద్దని, రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని కారు కూతలు కూశాడు. సీఏఏ చట్టం తీసేయనంతవరకూ మోడీ మాటలను పట్టించుకోవద్దని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ప్రధాని మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కౌన్సిలర్ ను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు విచారణ చేపట్టారు. 

2020-03-22 07:48 GMT

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మడ్గి చెక్‌పోస్టు వద్ద ముంబై నుంచి వచ్చిన ట్రావెల్ బస్సును నిలిపివేశారు. 37మంది దుబాయ్ నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి బస్సులో వస్తున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. జిల్లాలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.

2020-03-22 05:35 GMT

జనతా కర్ఫ్యూపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ మొజాంజాహి మార్కెట్‌ కూడలిలో ట్రాఫిక్ డీసీపీ బాబురావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. ప్ల కార్డులు పట్టుకుని కొవిడ్ 19 మహమ్మారిపై అవగాహన తీసుకువస్తున్నారు.

2020-03-22 04:30 GMT

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 4 వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు. 50 శాతం ఉద్యోగులు రొటేషన్ పద్దతిలో వారం విడిచి వారం కార్యాలయాల నుంచి పనిచేసేలా వెసులుబాటు.

సెక్రటేరియట్ నుంచి మండల స్థాయి ఉద్యోగుల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్. 60 ఏళ్ళు పైబడిన సలహాదారులు,చైర్ పర్సన్లు,కన్సల్టెంట్లు,HODల అనుమతి తో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు ఆదేశాలు. సెల్ఫ్ క్వారంటైన్స్ కు వెళ్లే 50 ఏళ్ళు పైబడిన ఉద్యోగులకు వచ్చే నెల 4 వరకు లీవ్ లు.


2020-03-22 04:19 GMT

జనతా కర్ఫ్యూ కు జై కొట్టిన బెజవాడ జనం

ఇళ్ల కే పరిమిత మైన కుటుంబాలు.

నిర్మానుష్యముగా బందరు రోడ్,ఏలూరు రోడ్,

బోసిపోయిన బస్టాండ్,రైల్వేస్టేషన్

మూతబడ్డ మాల్స్, సినిమహల్స్,పెట్రోల్ బంక్ లు, వ్యాపార వాణిజ్య సంస్థలు

ఉదయం 7 లోగా పాలు నీళ్లు, నిత్యవసర సరుకులు సమకూర్చుకున్నారు..

మద్యం, మాంసాహారం లు కోసం రాత్రే బారులు తీరారు..

అత్యవసర సేవల కోసం సిద్ధం గా ఉన్న పోలీసులు, వైద్యులు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, మీడియా,

జనతా కర్ఫ్యూ తో బలపడిన కుటుంబ అనుబంధం

ఆట పాట ల తో ఆనందంగా గడుపుతూ కరోనా వైరస్ కట్టడి

అక్కడక్కడ అవసరాల కోసం బయట తిరిగిన కొద్దిమంది..

14 గంటల కర్ఫ్యూ పాటించిన విజయవాడ వాసులు

సెల్ ఫోన్లు, టివి ల తో కాలక్షేపం చేసిన జనం

2020-03-22 02:46 GMT

జనతా కర్ఫ్యూ ను ప్రజలంతా సచ్చండంగా పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. విశాఖపట్నం లోని బీచ్ రోద్దులో ఈ ఉదయం ౮ గంటలకు పరిస్థితి ఇలా ఉంది 



 




 


2020-03-22 02:17 GMT

- కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేశాయి.

- ఈ రోజు నుంచి (మార్చి 22) మార్చి 31వతేదీ వరకు తమ రాష్ట్రాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ప్రకటించాయి.

- కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపాయి. 

2020-03-22 02:08 GMT

ప్రధాని నరేంద్ర మోదీ పిలువపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. ప్రజలు మాత్రం తెల్లవారుజామునుంచే ఇళ్లలోనుంచి బయటికి రాకుండా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ స్వచ్చందంగా పాటిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు తమ పనులు మానుకొని జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు. - పూర్తి కథనం 

Tags:    

Similar News