Yogi Adityanath: చట్టం అతిక్రమిస్తే నరకమే: బాబ్రీ మసీదు ఆశలు వదులుకోవాలని హెచ్చరించిన యూపీ సీఎం యోగి..!

Yogi Adityanath: బాబ్రీ మసీదు నిర్మాణం అనేది ఇక ముగిసిన అధ్యాయమని, మసీదును మళ్ళీ నిర్మిస్తామనే కలలు ఎప్పటికీ నెరవేరవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

Update: 2026-02-11 07:45 GMT

Yogi Adityanath: బాబ్రీ మసీదు నిర్మాణం అనేది ఇక ముగిసిన అధ్యాయమని, మసీదును మళ్ళీ నిర్మిస్తామనే కలలు ఎప్పటికీ నెరవేరవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

యోగి ప్రసంగంలోని కీలక అంశాలు:

మసీదు పునర్నిర్మాణం కోసం ఎదురుచూసే వారు ప్రపంచం అంతమయ్యే రోజు (ఖయామత్) వరకు వేచి చూసినా ఫలితం ఉండదని యోగి ఎద్దేవా చేశారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఆ భ్రమల నుంచే బయటకు రావాలని హితవు పలికారు.

 "అయోధ్యలో రాముడి గుడి కడతామని మాట ఇచ్చాం.. అన్నట్టుగానే అదే స్థలంలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించి తీరాం" అని యోగి గుర్తుచేశారు. సనాతన ధర్మం భారత్‌లో అంతర్భాగమని, దానిని వేరు చేయడం ఎవరి వల్లా కాదని పేర్కొన్నారు.

దేశంలో కాషాయ జెండా సగర్వంగా ఎగురుతూనే ఉంటుందని, ప్రధాని మోదీ అయోధ్యలో జెండా ఎగురవేయడం సనాతన ధర్మ విజయానికి ప్రతీక అని కొనియాడారు.

2017కు ముందు యూపీలో అల్లర్లు, కర్ఫ్యూలు ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారికి నరకం చూపిస్తామని, గౌరవించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హెచ్చరించారు.

కుట్రలు పన్నేవారు, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News