Rahul Gandhi: రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్: "భారత మాతను అమ్మేశారు!".. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావనతో లోక్‌సభలో హైడ్రామా

Rahul Gandhi: లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.

Update: 2026-02-11 09:07 GMT

Rahul Gandhi: లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అగ్రరాజ్యం అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ మొదలుకొని, అంతర్జాతీయ 'ఎప్‌స్టీన్ ఫైల్స్' వరకు రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో పెను సంచలనాన్ని సృష్టించాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండటంతో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. అయితే, మన దేశ ప్రజలకు ఏ దేశంతోనైనా పోటీ పడే సామర్థ్యం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌ను రాహుల్ తప్పుబట్టారు. అమెరికా సూపర్ పవర్‌గా కొనసాగాలంటే భారత్ డేటా అవసరమని, అందుకే ఈ ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. "భారత మాతను అమ్మేశారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.

అనిల్ అంబానీ, అదానీ ప్రస్తావన తీసుకురావడంతో సభలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్'లో అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్దీప్ పూరి పేర్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సభలో లేని వ్యక్తుల గురించి, బయట వ్యక్తుల గురించి మాట్లాడొద్దని స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా రాహుల్‌ను వారించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Full View


Tags:    

Similar News