Pariksha Pe Charcha 2026: పరీక్షల టెన్షన్‌ను జయించే ‘ఔషధం’ అదే.. కోయంబత్తూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధాని ఆసక్తికర సమాధానం!

Pariksha Pe Charcha 2026: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘పరీక్షా పే చర్చా’ (PPC 2026) రెండో ఎపిసోడ్ సోమవారం అత్యంత ఉత్సాహంగా సాగింది.

Update: 2026-02-09 05:57 GMT

Pariksha Pe Charcha 2026: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘పరీక్షా పే చర్చా’ (PPC 2026) రెండో ఎపిసోడ్ సోమవారం అత్యంత ఉత్సాహంగా సాగింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించారు. పరీక్షలను ఒక భయానక అడ్డంకిలా కాకుండా, జీవితంలో ఒక 'ఉత్సవం'లా (Festival) భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఒత్తిడికి చెక్.. కళలతోనే ఉపశమనం!

ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రధాని తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చదువును, కళలను వేర్వేరుగా చూడవద్దని మోదీ సూచించారు. "సైన్స్ ప్రయోగాలను బొమ్మల రూపంలో గీస్తూ చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుంది. నిత్యం చదువుతో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి కళలు ఒక ఔషధంలా పనిచేస్తాయి" అని వివరించారు.

స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిశ్రమ నిపుణులను కలిసి అనుభవం గడించాలని ప్రధాని హితబోధ చేశారు.

రికార్డులు బద్దలు.. 6.76 కోట్ల మంది భాగస్వామ్యం!

ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం మునుపటి రికార్డులను తిరగరాసింది. ఈసారి ఏకంగా 4.5 కోట్ల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 6.76 కోట్ల మంది ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా లేదా పరోక్షంగా భాగస్వాములయ్యారు. 2025లో 3.53 కోట్ల మందితో సృష్టించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఈ ఏడాది గణాంకాలు అధిగమించడం విశేషం.

దేశవ్యాప్త ప్రత్యక్ష ప్రసారం

దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోతో పాటు పలు ప్రైవేట్ ఛానెల్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ కార్యక్రమం లక్షలాది మందికి చేరువైంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సానుకూల దృక్పథం ఎంత అవసరమో ఈ వేదిక ద్వారా ప్రధాని మరోసారి నొక్కి చెప్పారు.

Tags:    

Similar News