Kuber: రూ.21 కోట్ల ‘కుబేరుడు’: నెలకు ₹20 లక్షల సంపాదన.. ఈ దున్నపోతు లైఫ్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాకే!
Kuber: హరియాణాలో జరుగుతున్న పశువుల సంతలో ఒక దున్నపోతు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Kuber: హరియాణాలో జరుగుతున్న పశువుల సంతలో ఒక దున్నపోతు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కేవలం దాని భారీ కాయంతోనే కాకుండా, దాని విలువతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'కుబేర్' అని పిలిచే ఈ దున్నపోతు ధర ఏకంగా రూ.21 కోట్లు పలుకుతుండటంతో పశుప్రేమికులు, వ్యాపారులు విస్తుపోతున్నారు.
రూ.21 కోట్లకు బిడ్.. అయినా అమ్మేది లేదంటున్న యజమాని!
ఫతేహాబాద్ జిల్లా నాగోడి గ్రామానికి చెందిన వికాస్ అనే రైతు ఈ అరుదైన దున్నపోతును పెంచుతున్నారు. ఇటీవల రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, ఇటాలియన్ మధ్యవర్తితో కలిసి దీనిని కొనుగోలు చేయడానికి రూ.21 కోట్ల బిడ్ దాఖలు చేసినట్లు యజమాని వెల్లడించారు. గతంలో రూ.11 కోట్లు ఆఫర్ చేసినా తిరస్కరించిన వికాస్.. ఇప్పుడు రూ.21 కోట్లు ఇచ్చినా అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కుబేర్‌ను తమ కుటుంబ సభ్యుడిలా, సొంత బిడ్డలా చూసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
కుబేర్ ప్రత్యేకతలు ఇవే..
ఈ దున్నపోతు దాదాపు 8 అడుగుల పొడవు, 5 అడుగులకు పైగా ఎత్తు ఉంటుంది. కుబేర్ వీర్యం (Semen) ద్వారా యజమానికి భారీ ఆదాయం లభిస్తోంది. నెలకు సుమారు రూ.20 లక్షల వరకు దీని ద్వారా సంపాదిస్తున్నారు. ఇప్పటివరకు దీని వీర్యంతో 3,000కు పైగా దూడలు జన్మించాయి. కుబేర్ ఆహారం చాలా విలాసవంతంగా ఉంటుంది. శీతాకాలంలో తాజా క్యారెట్లు, క్యారెట్ జ్యూస్ అందిస్తారు. రోజూ 5 కిలోమీటర్ల నడకతో పాటు, రెండు గంటల పాటు ప్రత్యేక మసాజ్ చేస్తారు. అనేక అంతర్జాతీయ పశు ప్రదర్శనల్లో నంబర్ వన్ టైటిళ్లను గెలుచుకున్న ఈ కుబేర్, తన అసాధారణ పరిమాణం మరియు రాజసం కారణంగా కురుక్షేత్ర సంతలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.