దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం
x
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ పిలువపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. ప్రజలు మాత్రం...

ప్రధాని నరేంద్ర మోదీ పిలువపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. ప్రజలు మాత్రం తెల్లవారుజామునుంచే ఇళ్లలోనుంచి బయటికి రాకుండా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ స్వచ్చందంగా పాటిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు తమ పనులు మానుకొని జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు. కూరగాయల మార్కెట్ల వారు మొదలుకొని మాంసం అమ్మకం దారులు వంటి చిరు వ్యాపారాలు సైతం స్వచ్చందంగా షాపులు మూసి వేశారు.

కర్ఫ్యూ తరువాత కూడా మనిషికీ మనిషికీ మధ్య దూరం పాటించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. కర్ఫ్యూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి, బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అలాగే దాదాపు రైళ్ళన్నీ శనివారం రాత్రి 10 గంటలనుంచే రద్దయ్యాయి. అయితే అంతకుముందు బయలు దేరిన రైళ్లను మాత్రం అధికారులు అనుమతించారు. అత్యవరస సేవలు వైద్యం, ఫైర్ సిబ్బంది వంటి సేవలను కొనసాగిస్తున్నారు.

లైవ్ అప్ డేట్స్..

కరోనా.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను చుట్టి పారేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోని సకల జనాళి కనిపించని శత్రువుతో అలుపెరుగని యుద్ధం చేస్తోంది. భారతావని లోనూ కరోనా తన ప్రతాపాన్ని చూపడం మొదలెట్టింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పీడితుల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు రెండో అంచులో కరోనా వైరస్ తీవ్రత మన దేశంలో ప్రవేశించింది. ఈ నేపధ్యంలో కరోనా తో జరుపుతున్న యద్ధంలో జనశ్రేణులను సమాయత్తం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ఈరోజు (మార్చి 22 ) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ స్వీయ నియంత్రణలో ఉండాలని పిలుపు నిచ్చారు. ఆసేతు హిమాచలం ప్రధాని చెప్పిన విషయానికి అనుకూలంగా స్పందించి.. కరోనా పై యుద్ధానికి సిద్ధం గా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రస్తుతం స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఈ జనత కర్ఫ్యూ.. కరోనా వైరస్ వార్తలు నిరంతరాయంగా మీకోసం అక్షర రూపంలో.. లైవ్ అప్ డేట్స్ చూడండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories