Janata Curfew Live Updates : కరోనా వైరస్ పై యద్ధం!

Update: 2020-03-22 01:13 GMT
Live Updates - Page 2
2020-03-22 01:51 GMT

ఆంద్ర ప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచే అన్నీ బంద్!

- ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది.

- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

- నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా శనివారమే ప్రజలు ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

- కరోనా పై భయం కాదు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 



2020-03-22 01:45 GMT

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా!

- తెలంగాణాలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు నిర్వహిస్తామనీ, సోమవారం ఉదయం 6 గంటల వరకూ ప్రజలేవరూ బయటకు రావద్దనీ సిఎం కేసీఆర్ సూచించారు.

- ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్నీ మూసివేసి, 15 రోజులకు సరిపడా రేషన్‌ సరకులు ఇంటింటికీ పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

- తాను బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోని అయన అన్నారు.

- అవసరమైతే రూ. పది వేల కోట్ల వరకైనా వెచ్చిస్తానని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

2020-03-22 01:38 GMT

కరోనా వైరస్ ప్రభావం దేశంలో మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది . దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితుల సంఖ్య ఇక్కడ 63కు చేరింది. మహారాష్ట్రలో కరోనా స్టేజ్‌3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. 

Tags:    

Similar News