లాక్ డౌన్ అంటే ఏమిటి.. లాక్‌ డౌన్‌ సమయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

Arun Chilukuri
Published on: 22 March 2020 7:14 PM IST
లాక్ డౌన్ అంటే ఏమిటి.. లాక్‌ డౌన్‌ సమయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
X

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు జిల్లాలు, తెలంగాణకు చెందిన 5 జిల్లాలు ఉన్నాయి. ఇంతకీ లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏం జరుగనుంది? లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

లాక్ డౌన్ అంటే మూతపడడమన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో 75 జిల్లాల్లో అన్ని సేవలు మూతపడనున్నాయి. ఆ యా జిల్లాలతో బాహ్య ప్రపంచానికి నిర్ణీత కాల వ్యవధి వరకు పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు రవాణా సంబంధాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ జిల్లాల్లో నిర్ణీత నిబంధనలు అమలు కానున్నాయి. ప్రజలు అకారణంగా రోడ్లపైకి వచ్చే అవకాశం లేదు. నెలాఖరు వరకు అంటే 31 వరకు ఈ జిల్లాల వాసులంతా ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది.

కరోనా బాధితులు ప్రధానంగా ఈ జిల్లాల వాసులతోనే సంబంధ బాంధవ్యాలు నెరపారు. దీంతో వారు కరోనా వాహకాలుగా మారారు. దీంతో వారిలో కరోనా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు కరోనా సోకకుండా నివారించాలంటే ప్రభుత్వం ముందున్న తక్షణ ఉపాయం లాక్‌డౌన్.

నిత్యావసర సౌకర్యాలు సరఫరా చేస్తూ ప్రతి ఒక్కరినీ నిర్ధేశిత ప్రాంతంలో ఉంచడమే లాక్‌డౌన్ లక్ష్యం. ఇలా చేయడం ద్వారా పరిమిత సంఖ్యలో కరోనా బాధితులను గుర్తించడం సులభంగా మారుతుంది. తద్వారా వారికి వైద్యమందించడం కూడా సులభమే.

భారత దేశంలో పెంపుడు జంతువులు మాత్రమే కాకుండా రోడ్లపై కుక్కలు, ఆవులు, ఎద్దులు వంటి జంతువులు స్వేచ్ఛగా విహరిస్తాయి. లాక్‌డౌన్ సమయంలో ఆహారం కోసం ఇవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరిస్తాయి. దీంతో ఇవి కరోనా వాహకాలుగా పనిచేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story