Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది..? మినిట్ టూ మినిట్ ఎప్పుడేం జరిగిందంటే..
Operation Sindoor: జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో గత నెల 22న ఉగ్రవాదులు జరిపిన నరమేధానికి బదులిచ్చింది భారత సైన్యం.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది..? మినిట్ టూ మినిట్ ఎప్పుడేం జరిగిందంటే..
Operation Sindoor: జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో గత నెల 22న ఉగ్రవాదులు జరిపిన నరమేధానికి బదులిచ్చింది భారత సైన్యం. భారత్‌వైపు చూస్తే ఇంట్లోకి దూరి చంపుతాం అని ప్రధాని మోడీ చెప్పినట్లుగానే భారత వాయుసేన పాక్ భూభాగంలోని ఉగ్రవాదుల స్థావరాలను పేల్చివేసింది. భారత్- పాక్ దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కారణమైన పహల్గాంలో ఆరోజు ఏం జరిగిందో మినిట్ టూ మినిట్ మీ ముందుంచుతాం..
వేసవి సెలవులు కావడంతో ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులు పచ్చిక బయళ్ళలో సేద తీరుతున్నారు. కొందరు పోనీరైడ్ చేస్తుంటే.. మరికొందరు ఫోటో షూట్‌లో మునిగి పోయారు. అంతలోనే ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ ధనాధన్ శబ్దాలు వినిపించాయి. కొకర్నాగ్ అడవుల నుంచి నడుచుకుంటూ వచ్చిన నలుగురు సాయుధులు బైసరన్ లోయలో పర్యాటకులపై విచక్షణ రహితంగా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు పేర్లు అడిగి, బట్టలు విప్పి నిర్ధారించుకుని మరీ కాల్చి చంపారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ వ్యాలీకి చేరుకున్న ఉగ్రవాదులు దాదాపు 40 మంది పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. టెర్రరిస్టుల కాల్పుల శబ్ధాలతో భయపడ్డ టూరిస్ట్‌లు కొందరు పరుగులు తీస్తే.. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నేలపై పడుకున్నారు. అయినా వదిలిపెట్టని టెర్రరిస్టులు దగ్గరకు వచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో 25 మంది భారతీయులు కాగా ఒక నేపాలీ టూరిస్ట్ ఉన్నాడు.
కాల్పులు జరిగిన ప్రదేశంలో గ్రౌండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం.. ఒకటే ఎంట్రీ గేట్ ఉండటం టూరిస్ట్‌ల పాలిట శాపంగా మారింది. తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉగ్రవాదులు గేట్ దగ్గరే ఉండటంతో తప్పించుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. టిఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా భావిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడిపై భారత దేశ ప్రజలు భగ్గుమన్నారు. పర్యాటకులపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది.