Operation Sindoor: భారత సైన్యానికి సెల్యూట్.. ప్రముఖుల ప్రశంసల జల్లు

Operation sindoor: భారత సైన్యానికి సెల్యూట్.. ప్రముఖుల ప్రశంసల జల్లు
x

Operation sindoor: భారత సైన్యానికి సెల్యూట్.. ప్రముఖుల ప్రశంసల జల్లు

Highlights

పహల్గామ్‌ ఉగ్రదాడికి సమాధానంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ ప్రారంభించింది.

Operation Sindoor: పహల్గామ్‌ ఉగ్రదాడికి సమాధానంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ ప్రారంభించింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై సమర్థవంతమైన క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ దాడులు విజయవంతంగా పూర్తవడంతో దేశవ్యాప్తంగా శుభాకాంక్షల సందడి మొదలైంది.

సోషల్ మీడియాలో #OperationSindoor, #JaiHind, #BharatMataKiJai హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు భారత్‌ భద్రతా దళాలకు సంఘీభావం ప్రకటిస్తూ పలు సందేశాలు పంచుకున్నారు.

చలనచిత్ర ప్రముఖుల స్పందన

  • మెగాస్టార్ చిరంజీవి

‘‘ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం గర్వకారణం. జై హింద్!’’ అంటూ రాసుకొచ్చారు.

  • రజనీకాంత్

‘‘ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. లక్ష్యం సాధించే వరకు ఆగకుండా ముందుకు పోతాం. దేశం అంతా మీతో ఉన్నాము!’’ అని రాసుకొచ్చారు.

  • విశ్వక్‌సేన్

‘‘ప్రతి కదలికపై నిశితంగా గమనించాలి. దేశ భద్రతకే మా పూర్తి మద్దతు.’’ అని పేర్కొన్నారు.

  • ప్రకాశ్ రాజ్

‘‘భారత్ సంయమనం పాటిస్తూ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఒక్క టార్గెట్ కూడా లేదు. ఇది న్యాయం కోసం చేసిన చర్య.’’ అని అభివర్ణించారు.

వ్యాపార, రాజకీయ ప్రముఖుల అభిప్రాయాలు

  • ఆనంద్ మహీంద్రా

‘‘మా ప్రార్థనలు భద్రతా బలగాల వెంట ఉన్నాయి. ఒక్క దేశంగా, ఒకే శక్తిగా నిలబడాలి.’’ అని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు.

  • మధుర్ భండార్కర్

‘‘భద్రతా దళాలకు మరింత బలాన్ని ఇచ్చే దిశగా మద్దతుగా నిలుద్దాం. వందేమాతరం!’’ అని రాసుకొచ్చారు.

  • ఖుష్బూ

‘‘భారత్ మాతాకీ జై. ఇది న్యాయం తలెత్తిన ఘట్టం.’’ అని నటి ఖుష్ఫూ వర్ణించారు.

  • రిథేశ్ దేశ్‌ముఖ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిథేశ్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.. ‘‘జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై!’’ అని రాసుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories