Viral News: పాము డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా.? వైరల్ అవుతోన్న వీడియో

Viral News: పాము డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా.? వైరల్ అవుతోన్న వీడియో
x

Viral News: పాము డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా.? వైరల్ అవుతోన్న వీడియో

Highlights

పాములు నాట్యం చేస్తాయ‌ని సినిమాల్లో మాత్ర‌మే చూసి ఉంటాం.

Viral News: సోషల్ మీడియాలో మనం ఎన్నో విచిత్రమైన వీడియోలను చూస్తుంటాం. కొన్ని ఆసక్తికరంగా, కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ నెటిజ‌న్ షేర్ చేసిన పాముతో సంబంధించిన వీడియో ఒక్కరోజులోనే వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము ఒక మ్యూజిక్ ట్యూన్‌కు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వీడియోలో ఓ వ్య‌క్తి తన ఫోన్‌లో నాగిన్ ట్యూన్ ప్లే చేయగానే పాము నేలపై కదలడం ప్రారంభించింది. ఆపై పాము శరీరాన్ని మెలికలు తిరగడం, నోరు కదిలించడం లాంటివి చేచేసింది. దీనిని కెమ‌రాలో రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారింది.

పాములు నాట్యం చేస్తాయ‌ని సినిమాల్లో మాత్ర‌మే చూసి ఉంటాం. అయితే నిజంగానే నాగిని మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఈ వీడియోను Viral Titi అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఏకంగా 2 కోట్ల‌కు పైగా చూడ‌డం విశేషం. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. మ‌రెందుకు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories