Viral Video: కింగ్ కోబ్రాపై వీధి కుక్కల అటాక్.. చివరికి ఏమైందంటే..?

Viral Video Street Dogs Attack Giant King Cobra
x

Viral Video: కింగ్ కోబ్రాపై వీధి కుక్కల అటాక్.. చివరికి ఏమైందంటే..?

Highlights

Viral Video: కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరని అనుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో అవి విశ్వరూపాన్ని చూపిస్తాయి.

Viral Video: కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరని అనుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో అవి విశ్వరూపాన్ని చూపిస్తాయి. ఆకలితో ఉన్న సమయంలో లేదా తనపై ఎవ‌రైనా దాడి చేయ‌డానికి వ‌చ్చిన స‌మ‌యంలో శున‌కాల ప్ర‌వ‌ర్తన అత్యంత భ‌యంక‌రంగా ఉంటుంది. కుక్క‌లు ఎంత అగ్రెసివ్‌గా ఉంటాయో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఓ వీడియో. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోకు సంబంధించిన వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని కుక్కలు కలిసి ఓ భారీ కింగ్ కోబ్రాను చుట్టుముట్టాయి. అయితే పాము ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అన్ని కుక్క‌లు చుట్టు ముట్టినా త‌న పోరాటాన్ని మాత్రం వీడ‌లేదు. కుక్క‌ల‌ను త‌రిమికొట్టేందుకు బుస‌లు కొడుతూ వాటిపైకి అటాక్ చేసింది.

అయితే శున‌కాలు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేవు. ఒక కుక్క తోక‌ను కొరికితే మ‌రొక‌టి న‌డుము భాగాన్ని టార్గెట్ చేసింది. ఇలా కోబ్రాకు ఆ శున‌కాలు చుక్క‌లు చూపించాయ‌ని చెప్పాలి. అయితే చివ‌రికి ఆ పాముకి ఏమైంద‌న్న వివ‌రాలు మాత్రం వీడియోలో లేవు.

దీనంత‌టినీ అక్క‌డే ఉన్న వారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. అంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన పాము కూడా కుక్క‌ల చేతిలో ఓడిపోయిందంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories