Coronavirus లైవ్ అప్డేట్స్ : మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా పాజిటివ్!

Update: 2020-03-30 10:43 GMT
Coronavirus live updates (representational image)

కరోనా వైరస్ తో మరణాల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్ర పూణే నగరంలో తొలి కరోనా మరణం నమోదు అయినట్టు ఆ అంగర మేయర్ మొహోల్ తెలిపారు. 52 సంవత్సరాల వ్యక్తీ కరోనా కారణంగా మృతి చెందారని ఆయన చెప్పారు. డయాబెటిస్..బీపీ సమస్యలున్న ఆయన కరోనా దెబ్బకు చికిత్స అందించినా కోలుకోలేకపోయారన్నారు. ఇక అయన దగ్గర బందువులను నగరంలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉంచినట్టు తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్తగా 12 మందికి కహారాష్ట్రలో కరోనా సోకినట్టు తేలడంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యా 215 కు చేరింది.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 27 కు చేరగా.. ఆదివారం నాటికి 1,091 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలింది.

కరోనా లైవ్ అప్డేట్స్ కోసం క్రిందికి స్క్రోల్ చేయండి..

ఇండియాలో కరోనా ప్రభావాన్ని తెలిపే చిత్రం ఇది..


Full View ఇండియాలో కరోనా ప్రభావం వివరాలు రాష్ట్రాల వారీగా.. Full View
Live Updates
2020-03-30 16:06 GMT

తెలంగాణను కరోనా వైరస్ వణికిస్తుంది. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ పట్టణంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ శశాంక్ వెల్లడించారు. ఇండోనేసియా నుంచి వచ్చిన కొంత మంది సభ్యుల బృందం లో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా సోకింది.-పూర్తి కథనం  

2020-03-30 15:49 GMT

ఒక నియోజక వర్గాన్ని పాలించే ఓ ఎమ్మెల్యే నిండుగర్భిణీకి వైద్యం అందించారు. ఏదైనా అత్యవసం అయితే తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు. రాష్ట్రంలో తెలంగాణలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకుగాను ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసింది.-పూర్తి కథనం  

2020-03-30 15:47 GMT

దేశంలో కరోనాపై పోరుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ నిధికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విరాళాన్ని ప్రకటించారు. ఆయన తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.-పూర్తి కథనం 

2020-03-30 13:25 GMT

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.- పూర్తి కథనం   

2020-03-30 12:39 GMT

మనసు కదిలించే కథనాలు: జీవించే అవకాశం ఉండీ యువత కోసం త్యాగం చేస్తున్న పెద్దలు! సాధారణంగా ఎంత వయసు వచ్చినా.. శరీరం ఒంగిపోయినా.. జీవితం మీద మమకారం మానవుడికి పోనేపోడు. ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి తప్ప. అటువంటి వారు మహనీయులుగా మిగిలిపోతారు. ఇప్పుడు కరోనా వైరస్ అటువంటి మానవీయుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.                 -పూర్తి కథనం 

2020-03-30 12:03 GMT

కరోనాకు మధ్యప్రదేశ్ లో మరొకరు బలి: మూడు రోజుల క్రితం ఉజ్జయినిలో మరణించిన 38 ఏళ్ల వ్యక్తి యొక్క రక్త నమూనాలు సోమవారం కరోనావైరస్ కు పాజిటివ్ గా వచ్చాయని ఒక అధికారి తెలిపారు.దీంతో మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య మూడుకి చేరుకుంది. - పూర్తి కథనం  

2020-03-30 11:33 GMT

ట్రూ లీడర్‌.. సీఎం కేసీఆర్‌కు సోనూ సూద్‌ సెల్యూట్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రాల కూలీలకు సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. -పూర్తి కథనం 

2020-03-30 11:18 GMT

గుజరాత్‌లో కోవిడ్ తో మరణించిన మహిళ: గుజరాత్ లో ఈరోజు 45 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయింది. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఆరుకు చేరింది. గుజరాత్‌లో 69 మంది మాత్రమే కోవిడ్ బారిన పడినప్పటికీ ఆరుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగా గుజరాత్‌లోనే నమోదు అవుతోంది.

2020-03-30 11:17 GMT

లాక్ డౌన్ పాటించని ఆకతాయిలు.. పోలీసుల వినూత్న ప్రయోగం: కరోనా లాక్ డౌన్ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఆకతాయిలి పెడచెవిన పెడుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో కర్నూలు నగర మూడవ పట్టణ పోలీసులు కొత్తగా ఆలోచించి హిజ్రాల సహాయం తీసుకున్నారు. వారి సహాయంతో ప్రభుత్వం ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా రోడ్ల మీద తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. - పూర్తి కథనం 

2020-03-30 11:13 GMT

మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం : ట్రంప్‌ కరోనా అమెరికాను గడగడలాడిస్తోంది. స్పీడ్ గా పెరుగతోన్న పాజిటివ్ కేసులు అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండటం మరింత కలవరపరుస్తోంది. కరోనా పంజా విసురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -పూర్తికథనం  

Tags:    

Similar News