ట్రూ లీడర్‌.. సీఎం కేసీఆర్‌కు సోనూ సూద్‌ సెల్యూట్‌

Arun Chilukuri
Updated on: 30 March 2020 5:19 PM IST
ట్రూ లీడర్‌.. సీఎం కేసీఆర్‌కు సోనూ సూద్‌ సెల్యూట్‌
X

పొరుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు 3.35 లక్షల మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారని నిన్న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపారు. తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ బియ్యం, పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. 'ట్రూ లీడర్.. శాల్యూట్' అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story