తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

తెలంగాణను కరోనా వైరస్ వణికిస్తుంది. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Updated on: 30 March 2020 9:31 PM IST
తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
X
Representational Image

తెలంగాణను కరోనా వైరస్ వణికిస్తుంది. తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ పట్టణంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ శశాంక్ వెల్లడించారు. ఇండోనేసియా నుంచి వచ్చిన కొంత మంది సభ్యుల బృందం లో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా సోకింది. తాజాగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారినపడ్డారు. ఇవి కూడా లోకల్ కాంటాక్ట్ కేసులని, ఆవ్యక్తి కి దగ్గరగా మెలగడం వల్ల తల్లి, సోదరికి కరోనా వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

ఆ వ్యక్తి ఇంట్లో మొత్తం 8 మంది నివసిస్తారు. అతడితో కలిసి ఇప్పటి వరకు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిని కలిసిన వారిని కూడా గుర్తిస్తున్నామని, త్వరలోనే వారందరిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలను కూడా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో తెలంగాణలో 72 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story