లాక్ డౌన్ పాటించని ఆకతాయిలు.. పోలీసుల వినూత్న ప్రయోగం: ట్రాన్స్‌జెండర్స్‌తో.

Arun Chilukuri
Updated on: 30 March 2020 5:02 PM IST
లాక్ డౌన్ పాటించని ఆకతాయిలు.. పోలీసుల వినూత్న ప్రయోగం: ట్రాన్స్‌జెండర్స్‌తో.
X

కరోనా లాక్ డౌన్ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఆకతాయిలి పెడచెవిన పెడుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో కర్నూలు నగర మూడవ పట్టణ పోలీసులు కొత్తగా ఆలోచించి హిజ్రాల సహాయం తీసుకున్నారు. వారి సహాయంతో ప్రభుత్వం ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా రోడ్ల మీద తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ద్వారా వచ్చే వారికి కరోనా పై తమదైన శైలిలో అవగాహన పెంచుతూ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ట్రాన్స్జెండర్స్.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story