ఎర్రగడ్డ ఆసుపత్రి లో పెరుగుతున్న కేసులు

ఎర్రగడ్డ ఆసుపత్రి  లో పెరుగుతున్న కేసులు
x
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం సమర్ధంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. ఈ నేపద్యంలోనే రవాణా వ్యవస్థను, షాపులను, కార్యాలయాలను, పాఠశాలలను పూర్తిగా బంద్ చేసారు. ఇందులో భాగంగానే వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. -

కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. కాగా ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజుల వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబుల పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు మందు తాగడానికి అలవాటు పడి ఉండడంతో ఒక్క సారిగా అది దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తీవ్రమైన మానసిక సమస్యలతో ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు క్యూ కడుతున్నారు.

మూడు, నాలుగు రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం మరికొంత మంది వైద్యులు మాట్లాడుతూ ఒక్క సారిగా మద్యం దొరకకపోయేసరికి మద్యం ప్రియులకు ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ కారణంగా శరీరంలో విపరీతమైన వణుకు వస్తుందని తెలిపారు. దీని కారణంగా ఫిట్స్ కూడా వస్తుందని వారు తెలిపారు. ఆ తరువాత దశలో రోగి పిచ్చివానిలా ప్రవర్తించి ఆత్మహత్యలకు కూడా పాల్పడతారని వారు తెలిపారు. తమకి తాము గాయపరుచుకుంటారని తెలిపారు. ఇలాంటి సమయంలో వారు వైద్యులను తప్పకుండా సంప్రదించాలని లేదంటే ప్రమాదం అని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే నగరంలోనే సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అంతే కాక మద్యం దొకకపోవడంతో 5 గురు వ్యక్తులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని తెలిపారు. అంతే కాక హైదరాబాద్‌లో ఓ యువకుడు మద్యం కోసం గొంతు కోసుకున్నాడు. ఇక వికారాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్లుర్తి మండలంలో కాశమైన కిష్టయ్య అనే వ్యక్తి తన ఇంట్లోనే దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు.

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి కల్లు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి ఆదివారం మధ్యాహ్నం కత్తితో పొట్ట భాగంలో కోసుకున్నాడు. ఇక మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన నత్తి మంగమ్మ కల్లు లభించక మతిస్తిమితం కోల్పోయాడు. ఇదే నేపధ్యంలో ఇంకా ఎంతో మంది పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే పిచ్చి కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories