Patanjali: పతంజలి ప్రకటన కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై సీరియస్

Patanjali: తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

Update: 2024-04-30 12:00 GMT

Patanjali: పతంజలి ప్రకటన కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై సీరియస్

Patanjali: తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈవిషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ నేడు కోర్టుకు తెలియజేసింది. అయితే, ఈ చర్యలను చట్టప్రకారం తీసుకున్నారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

Tags:    

Similar News