కరోనాకు మధ్యప్రదేశ్ లో మరొకరు బలి.. అంతకుముందు ఒక పార్టీకి హాజరైన మృతుడు

కరోనాకు మధ్యప్రదేశ్ లో మరొకరు బలి.. అంతకుముందు ఒక పార్టీకి హాజరైన మృతుడు
x
representational image
Highlights

మూడు రోజుల క్రితం ఉజ్జయినిలో మరణించిన 38 ఏళ్ల వ్యక్తి యొక్క రక్త నమూనాలు సోమవారం కరోనావైరస్ కు పాజిటివ్ గా వచ్చాయని ఒక అధికారి తెలిపారు.

మూడు రోజుల క్రితం ఉజ్జయినిలో మరణించిన 38 ఏళ్ల వ్యక్తి యొక్క రక్త నమూనాలు సోమవారం కరోనావైరస్ కు పాజిటివ్ గా వచ్చాయని ఒక అధికారి తెలిపారు.దీంతో మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య మూడుకి చేరుకుంది. అంతకుముందు ఇండోర్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, ఉజ్జయినికు చెందిన ఒక మహిళ ఇండోర్‌లో కరోనావైరస్ కారణంగా మరణించారు.

38 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ఉందని సోమవారం ఉదయం ఇండోర్‌కు చెందిన మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ ల్యాబ్ నుంచి మాకు నివేదిక వచ్చింది అని ఉజ్జయిని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనుసుయా గావ్లీ పిటిఐకి తెలిపారు. ఉజ్జయినిలోని అంబర్ కాలనీ నివాసి అయిన ఆ వ్యక్తి అనారోగ్య కారణాలతో ఉజ్జయిని మాధవ్ నగర్ ఆసుపత్రిలో చేరాడు.. అయితే కాసేపటికే పరిస్థితి విషమంగా మారడంతో మరణించాడు.

వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తికి అధిక రక్తపోటు ఉందని మరియు ఆసుపత్రిలో చేరే సమయంలో ఛాతీ నొప్పి మరియు అసౌకర్యంగా ఉందని చెప్పినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే అతనికి వైరస్ లక్షణాలు ఉన్నందున అతని రక్తం నమూనాలను పరీక్ష కోసం పంపారు. ఈ క్రమంలో అతనికి పాజిటివ్ అని తేలినట్టు సోమవారం అధికారులు తెలిపారు. కాగా అనారోగ్యానికి గురయ్యే ఐదు రోజుల ముందు రాజస్థాన్‌కు ఆనుకొని ఉన్న సరిహద్దుకు సమీపంలోని నీముచ్ జిల్లాను ఆయన సందర్శించారు.

అతను అక్కడ ఒక పార్టీలో రాజస్థాన్ కు చెందిన కొంతమందితో ఉన్నారు. అనంతరం ఉజ్జయినికు తిరిగి వచ్చిన తరువాత, జ్వరం, జలుబు మరియు దగ్గుతో బాధపడ్డాడు. దీంతో వైరల్ సంక్రమణ వ్యాప్తిని తనిఖీ చేయడానికి అతను తిరిగిన ప్రాంతంలో ఒక సర్వే జరుగుతోంది. ఇదిలావుంటే సోమవారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది కరోనావైరస్ కేసులను అధికారులు ధృవీకరించారు, దీంతో మొత్తం సంఖ్య 47 కి చేరుకుందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories