విడుదలకు ముందే 90 కోట్లు

'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన రామ్ చరణ్ తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2019-01-05 10:17 GMT
Vinaya Vidheya Rama

'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన రామ్ చరణ్ తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

కీయారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను డివివి దానయ్య డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 10 వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల ఇంకా అవ్వలేదు కానీ ఇప్పటికే దాదాపు వంద కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 'వినయ విధేయ రామ' సినిమా 90 కోట్ల కు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:

నిజాం: 20 కోట్లు

సీడెడ్: 15 కోట్లు

యూఏ: 11.70 కోట్లు

ఈస్ట్: 7.20 కోట్లు

గుంటూరు: 7.80 కోట్లు

కృష్ణ: 6.00కోట్లు

వెస్ట్: 5.60 కోట్లు

నెల్లూరు: 3.30 కోట్లు

ఏపీ/తెలంగాణ: 77 కోట్లు

పక్క రాష్ట్రాల్లో: 8.50 కోట్లు

ఓవర్సీస్: 9 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 94.10 కోట్లు

Similar News