పాటలో మాధుర్యం: నిశీధిలో సిరివెన్నెల వెండిపూల వాన ''జామురాతిరి జాబిలమ్మ'' పాట

కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంది. చక్కని సంగీతానికి చిక్కని సాహిత్యం తోడైతే వచ్చే మజా అది.

Update: 2020-01-30 12:28 GMT

కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంది. చక్కని సంగీతానికి చిక్కని సాహిత్యం తోడైతే వచ్చే మజా అది. అంతేకాదు.. కొన్ని పాటల చిత్రీకరణ చూసిన తరువాత అవి మరింత మనసులోతుల్లో నిలిచిపోతాయి. అటువంటి పాటలు తలుచుకుంటే చాలు మనసు సంతోషంతో కేరింతలు కొడుతుంది. అటువంటి పాటలు రాయడంలో సిరివెన్నెల చిందించే హొయలు వేరుగా ఉంటాయి. కీరవాణి సంగీతానికి సిరివెన్నెల జత కూరితే అది ఎప్పటికీ హృదయాల్లో నిలిచిపోయే పాట అయితీరుతుంది. వీరిద్దరికీ మంచి సన్నివేశ బలం దొరికితే.. వదులుతారా? అస్సలు వదలరు. సరిగ్గా ఆ పనే చేశారు క్షణ క్షణం సినిమాలో..

అప్పటివరకూ ఉప్పూ నిప్పులా కస్సు బస్సు మానుకున్న నాయికా, నాయకులు అనుకోకుండా రాత్రి సమయంలో అడవిలో చిక్కుపడిపోతారు. అక్కడ ఒకరి నేపధ్యం ఒకరు తెలుసుకుంటారు. ఇద్దరి మధ్యలో ఉన్న అనుమానపు పొరలు తొలగిపోతాయి. ఆ నిశీధిలో భయపడుతూ ఉన్న కతానాయకిని నిద్ర పుచ్చడానికి కథానాయకుడు పాడే జోలపాట ఇది..

జబిలమ్మతో జోల పాదిన్చినట్టు ఉండే ఆ పాటలోని పంక్తులు కీరవాణి సంగీతంలో వీనుల విందుగా వినపడతాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అలవోకగా విసిరేసిన అక్షరాల మూటలు ఆ స్వరాల్లో ప్రేక్షకుల్ని ఊయలలూగిస్తాయి.

మీరూ ఈ సాహిత్యం మీద ఓ లుక్కేయండి..వీలుంటే పాట వింటూ ఈ సిరివెన్నెల ఆ అడవిలో కొన్ని క్షణాల పాటు విడిచిపెట్టిన సాహితీ వెండిపూలను ఏరుకుని మనసులో దాచుకోండి.

జమురాతిరీ జాబిలమ్మా..జోలపాడదా ఇలా..

జోరుగాలిలో జాజికొమ్మ.. జారనీయకే కలా..

వయ్యారి వాలుకళ్ళలోన.. వారాల వెండిపూలవాన

స్వరాల ఊయలూగువేళ

|| జామురాతిరీ జాబిలమ్మ..జోలపాడదా ఇలా.. ||

కుహు కుహు సరాగాలే శ్రుతులుగా.. కుశలమా అనే స్నేహం పిలువగా

కిల కిల సమీపించే సడులతో.. ప్రతి పొద పదాలేవో పలుకగ..

కునుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని

వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..

|| జామురాతిరీ జాబిలమ్మ..జోలపాడదా ఇలా.. ||

మనసులో భయాలన్నే మరిచిపో..మగతలో మరోలోకం తెరుచుకో..

కలలతో ఉషాతీరం వెతుకుతూ.. నిడురతో నిశాహరని నడిచిపో..

చిటికలోన చిక్కబడ్డ కటికచీకటి

కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

|| జమురాతిరీ జాబిలమ్మా..జోలపాడదా ఇలా..

జోరుగాలిలో జాజికొమ్మ.. జారనీయకే కలా..

వయ్యారి వాలుకళ్ళలోన.. వారాల వెండిపూలవాన

స్వరాల ఊయలూగువేళ ||

ఆహాహహా..తనాన నానా

ఉహుహూ హా..

సినిమా: క్షణ క్షణం (1991)

పాట: జమురాతిరీ జాబిలమ్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

పాడిన వారు: నాగూర్ బాబు(మనో), చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

నటీనటులు: వెంకటేష్, శ్రీదేవి

దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

నిర్మాత: కె.ఎల్.నారాయణ  


Full View


Tags:    

Similar News