కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పేరు. ముఖ్యంగా విదేశాల్లో విపరీతంగా కరోనా ప్రబలి ఉండు. ఈ నేపధ్యంలో తెలంగాణా లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇస్తున్నారు.
ఇక తెలుగు సినిమా పరిశ్రమకు కూడా కరోన ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. అన్ని షూటింగ్ లు ఆగిపోయాయి.
విదేశాల్లో షూటింగు లు కూడా రద్దు చేసుకుని తిరిగి వచ్చేస్తున్నాయి సినిమా టీం లు. అలా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది ప్రభాస్ 20వ సినిమా. ఈ సినిమా లో ప్రియదర్శి ఒక కీలాక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన కూడా మొన్నటి వరకూ జార్జియా లో ఉన్నారు. మొన్న అయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఎయిర్ పోర్ట్ లో ఆయనకు అన్ని పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేవని ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.
అయితే, ప్రియదర్శి ఇంటికి చేరుకున్న వెంటనే తనకు తానుగా గృహనిర్భంధం విధించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను 14 రోజుల పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని భావిస్తున్నాను అన్నారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ, విదేశాల నుంచి వచ్చినందున అందరి ఆరోగ్యం తో సంబంధం ఉన్న విషయం కావడంతో తాను సోషల్ డిస్టేన్స్ పాటించడం బాధ్యతగా భావించానని చెప్పారు ప్రియదర్శి. కరోనా గురించి భయపడటం కంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రియదర్శి చేసిన ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు.
ప్రియదర్శి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇటీవల తన మల్లేశం సినిమా ద్వారా ప్రేక్షకులలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయంతో మరింత మంది మనసులు గెలుచుకున్నారు.
So I made a choice, I will be at home for next 14 days before giving myself a clean chit.
— Priyadarshi (@priyadarshi_i) March 17, 2020
Because #SocialDistancing is the need of the hour.
Let's not panic but let's just be cautious and considerate towards each other's wellbeing.#COVID2019 #SocialDistancingWorks pic.twitter.com/furHSFrrdA