Aishwarya Addala: సీరియల్ నటి ఐశ్వర్య పెళ్లి చేసుకుని మోసం చేసింది.. భర్త సంచలన ఆరోపణలు
Aishwarya Addala: ఐశ్వర్య తన దగ్గర రూ.25 లక్షలు కాజేసి.. విడాకులు కోరుతూ వేధిస్తుందని ఆరోపిస్తున్న శ్యాంబాబు
Aishwarya Addala: సీరియల్ నటి ఐశ్వర్య పెళ్లి చేసుకుని మోసం చేసింది.. భర్త సంచలన ఆరోపణలు
Aishwarya Addala: సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య వివాదంలో చిక్కుకున్నారు. ఐశ్వర్య తనను మోసం చేసిందంటూ ఆమె భర్త మీడియాను ఆశ్రయించారు. పెళ్లయిన తర్వాత తన దగ్గర పాతిక లక్షలు కాజేసిందని.. విడాకులు అడిగి తనను తన కుటుంబాన్ని వేధిస్తుందని ఆరోపించారు భర్త శ్యాంబాబు. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్‌కుమార్, ఐశ్వర్యకు వివాహం జరగగా.. పెళ్లయిన నెలరోజులకే వివాహేతర సంబంధం బయటపడిందని భర్త శ్యాంబాబు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేష్, ఐశ్వర్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని.. ప్రశ్నించినందుకు విడాకులు అడిగి మానసిక వేధింపులకు గురిచేస్తుందని చెబుతున్నారు.