RRR release in Rajamouli app: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను స్వంత యాప్ లో విడుదల చేస్తారా?

RRR release in Rajamouli app: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీని తన సొంత యాప్ లో రిలీజ్ చేయబోతున్నాడా?

Update: 2020-07-04 15:10 GMT

RRR release in Rajamouli app: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీని తన సొంత యాప్ లో రిలీజ్ చేయబోతున్నాడా? ధియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు.. అందుకే ప్రేక్షకుల దగ్గరకే సినిమాను తీసుకెళ్ళబోతున్నాడా? ఇప్పటికే దీనిపై కసరత్తు జరుగుతోందా అంటే టాలీవుడ్ లో అవుననే సమాధానమే వస్తోంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ చిత్ర ఆర్ ఆర్ ఆర్. దాదాపు 250 కోట్ల రూపాయిల బడ్జెట్ ఇంకా దాదాపు 30 శాతం షూటింగ్ పెండింగ్ లో వుంది ఇక మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది లో రిలీజ్ చెయ్యలనుకున్నారు చిత్ర యూనిట్ కానీ అనుకోకుండా వచ్చిన కరోనా భూతం ఇండస్ట్రీని కుప్పకూల్చేసింది. థియేటర్లకు జనం రాకుండా చేసేసింది దాంతో సినిమా విడుదలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు రాజమౌళి కూడా భిన్నంగా ఆలోచిస్తున్నాడు రాజమౌళి వరల్డ్ యాప్ ద్వారా ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేయాలని ఒక వ్యూస్ కి 500 రూపాయిల టికెట్ ధరను ఫిక్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

Tags:    

Similar News