Rana Guest Roll in Prabas Movie: ప్రభాస్ సినిమాలో రానా గెస్ట్ రోల్?

Rana Guest Roll in Prabas Movie: ప్రభాస్ సినిమాలో రానా గెస్ట్ రోల్?
x
Prabhas, Rana (File Photo)
Highlights

Rana Guest Roll in Prabas Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

Rana Guest Roll in Prabas Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రానా, ప్రభాస్ ముఖ్య పాత్రలు పోషించారు..భ‌ళ్ళాల‌దేవుడిగా రానా అలరిస్తే, బాహుబ‌లి, అమ‌రేంద్ర బాహుబ‌లి పాత్ర‌ల‌లో ప్ర‌భాస్ న‌ట‌విశ్వ‌రూపం చూపించాడు... ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్, రానా కలిసి ఎప్పుడు నటిస్తారని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఓ సినిమాలో రానా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.. ఈ సినిమాలో ఓ రెండు నిమిషాలు కనిపించే పాత్రలో రానా మెరవనున్నడని సమాచారం అయితే దీని పైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఈ సినిమాని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని నవంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది..

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్

దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కబోయే సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.. దీనికి సంబంధించిన నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారు..

ఇక ఇటు రానా విషయానికి వస్తే ప్రస్తుతం రానా నటించిన ఆరణ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. కరోనా వలన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాతో పాటుగా రానా విరాటపర్వం అనే ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు రానా..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories