గుణశేఖర్ 'హిరణ్యకశ్యప' మూవీలో విష్ణుమూర్తి పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో ?

గుణశేఖర్ హిరణ్యకశ్యప మూవీలో విష్ణుమూర్తి పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో ?
x
Rana Daggubati, GunaSekhar (File Photo)
Highlights

గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా 'హిరణ్య కశ్యప' అనే పౌరాణిక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గత 3ఏళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయిందని గుణశేఖర్ తెలియజేసాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

అయితే పౌరాణిక సినిమాలు తెరకెక్కించిన అనుభవం గుణ శేఖర్ కు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా 'రామాయణం' వంటి పౌరాణిక సినిమాను తెరకెక్కించిన ఎక్స్ పీరియన్స్‌తో ఇపుడు రానా హీరోగా 'హిరణ్య కశ్యప' మూవీ శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా గతంలో వచ్చిన భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను గుణ శేఖర్ హిరణ్యకశ్యపుడి కోణంలో తెరకెక్కించబోతున్నాడు.

తెలుగులో తొలి టాకీ సినిమాగా 'భక్త ప్రహ్లాద'కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హెచ్ఎమ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మునిపల్లె సుబ్బయ్య హిరణ్య కశ్యపుడిగా నటిస్తే, మాస్టర్ కృష్ణారావు ప్రహ్లాదుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్‌లో చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో 'భక్త ప్రహ్లాద' సినిమా విడదలైంది. ఈ సినిమాలో ఎస్వీఆర్ హిరణ్యకశ్యపుడిగా నటించారు.. యువ కథనాయకుడు తరుణ్ తల్లి రోజా రమణి భక్త ప్రహ్లాదుడిగా టైటిల్ రోల్ పోషించడం విశేషం.

హిరణ్య కశ్యపుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి అతన్ని సంహారిస్తాడు. ఈ పాత్ర కోసం టాలీవుడ్ ఓ స్టార్ హీరోను అనుకుంటున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం జూ. ఎన్టీఆర్‌ను గుణశేఖర్ సంప్రదించినట్టు సమాచారం. పాత్ర నిడివి తక్కువే అయినా..ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ సినిమాలో విష్ణుమూర్తి పాత్ర పోషిస్తే.. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మరి ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రంలో నటించే విషయమై ఇంకా కన్ఫామ్ చేయలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories