Ram Charan Vinaya Vidheya Rama: బుల్లితెర పై అదరగొడుతున్న వినయ విధేయ రామ!

Ram Charan Vinaya Vidheya Rama: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ .
Ram Charan Vinaya Vidheya Rama: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ .. 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలం అయింది.అయితే ఈ సినిమా వెండితెర మీద పెద్దగా సత్తా చాటలేకపోయినా బుల్లితెర మీద మాత్రం ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
ఓ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా మంచి రేటింగ్‌లను సంపాదించుకుంటుంది. తాజాగా ఓ ఛానల్ లో తోమ్మిదోసారి ప్రసారం అయిన ఈ సినిమా ఏకంగా 6.41 రేటింగ్ సాధించింది. దీనితో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది. అటు బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్నాడు బోయపాటి.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న నేపధ్యంలో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు.
ఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMTఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం
19 Aug 2022 7:44 AM GMTబాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMT
మునుగోడు గెలుపు ప్రజలే నిర్ణయిస్తారన్న మంత్రి తలసాని
20 Aug 2022 6:24 AM GMTయూపీ బన్కే బీహారీ ఆలయంలో విషాదం
20 Aug 2022 6:00 AM GMTప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు
20 Aug 2022 5:42 AM GMTVijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMT