Anasuya: అనసూయ పరువు అంతా పోయిందిగా..!
Anasuya Bharadwaj: హైదరాబాద్ హోలీ వేడుకల్లో అనసూయ భరద్వాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది యువకులు ఆమెను 'ఆంటీ' అంటూ ఏడిపించగా, అనసూయ హుందాగా స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Anasuya: అనసూయ పరువు అంతా పోయిందిగా..!
Anasuya Bharadwaj: టాలీవుడ్ పాన్ ఇండియా యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఎక్కడ ఉన్నా అక్కడ సందడి ఉండాల్సిందే. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన హోలీ సంబరాల్లో ఆమె స్పెషల్ గెస్ట్‌గా మెరిశారు. అయితే, రంగుల పండగలో రచ్చ చేద్దామనుకున్న అనసూయకు కొందరు యువకుల నుండి ఊహించని పరిణామం ఎదురైంది. స్టేజీపై ఆమె మాట్లాడుతుండగా, కింద ఉన్న కొందరు ఆకతాయిలు 'ఆంటీ.. ఆంటీ' అంటూ కేకలు వేస్తూ ఏడిపించడం మొదలుపెట్టారు.
అనసూయ సైలెంట్
సాధారణంగా అనసూయ అంటే 'డేరింగ్ అండ్ డాషింగ్'. ఎవరైనా తనను కావాలని రెచ్చగొట్టాలని చూస్తే, అస్సలు తగ్గకుండా వెంటనే కౌంటర్ ఇచ్చే స్వభావం ఆమెది. గత ఏడాది హోలీ వేడుకల్లో కూడా సరిగ్గా ఇలాగే ఒక వ్యక్తి 'ఆంటీ' అని పిలిస్తే.. "దమ్ముంటే స్టేజీపైకి వచ్చి మాట్లాడు" అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కానీ, ఈసారి మాత్రం అనసూయ తనలోని మరో కోణాన్ని చూపించారు. ఆకతాయిలు ఎంతగా రెచ్చగొడుతున్నా, తన అసహనాన్ని ప్రదర్శించకుండా.. చిరునవ్వుతోనే వారికి సమాధానమిచ్చారు. ఆ కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా, హుందాగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అనసూయ చూపిన ఈ పరిణతిని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
టాలెంట్‌తో సమాధానం
'జబర్దస్త్'తో కెరీర్ మొదలుపెట్టి, నేడు అల్లు అర్జున్ 'పుష్ప' లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, వయస్సుపై వచ్చే కామెంట్లను ఎలా డీల్ చేయాలో బాగా నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. నేను నా వృత్తిలో రాణిస్తున్నాను, ఆ బాధ్యతలు నాకు తెలుసు అన్నట్లుగా ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.
రంగుల పండుగ పూట ఇలాంటి ఆకతాయి పనులు చేయడం సరికాదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, అనసూయ మాత్రం ఏమీ జరగనట్లే తన పనిలో బిజీ అయిపోయారు. మరికొందరు మాత్రం, ఆమె ఇగ్నోర్ చేసిన తీరు చూస్తుంటే.. విమర్శకుల నోళ్లు మూయించడంలో అనసూయ రూట్ మార్చినట్లుంది అని కామెంట్ చేస్తున్నారు.