Vijay-Rashmika Wedding : విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..?
Vijay-Rashmika Wedding: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహం రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లికి అయిన ఖర్చు హాట్ టాపిక్‌గా నిలిచింది.
Vijay-Rashmika Wedding : విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..?
ViRosh wedding highlights : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్యాలెస్ వెడ్డింగ్ నుండి హైదరాబాద్ రిసెప్షన్ వరకు ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఉదయపూర్ టు హైదరాబాద్.. కోట్లలో ఖర్చు
ఈ పెళ్లి కోసం విజయ్-రష్మికలు భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయపూర్‌లోని రాజసం ఉట్టిపడే ప్యాలెస్‌లో జరిగిన నాలుగు రోజుల వేడుకలు, ఆ తర్వాత హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన గ్రాండ్ రిసెప్షన్.. ఇలా అన్నింటికీ కలిపి సుమారు 15 నుండి 25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.కేవలం నగలు, వస్త్రాల కోసమే కోట్లు వెచ్చించారట. విజయ్ కుటుంబం పెళ్లి కోసం ప్రత్యేకంగా 3 కేజీల బంగారు ఆభరణాలు చేయించినట్లు సమాచారం. ఈ మొత్తం వివాహ వేడుకను ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ అత్యంత విలాసవంతంగా ప్లాన్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌తో 60 కోట్ల డీల్?
ఈ పెళ్లిలో మరో హైలైట్ ఏమిటంటే.. వీరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో రైట్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ విజయ్-రష్మిక పెళ్లి వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు సుమారు 60 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, టాలీవుడ్‌లో ఒక పెళ్లి వీడియోకు వచ్చిన అత్యధిక ధర ఇదే అవుతుంది.
సంప్రదాయాల కలయిక
ఈ పెళ్లి కేవలం ఆడంబరంగానే కాకుండా, సంప్రదాయబద్ధంగా కూడా జరిగింది. విజయ్ పూర్వీకుల గ్రామం తుమ్మనపేట (మహబూబ్‌నగర్)లో ఈ జంట ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించింది. అటు విజయ్ తెలుగు సంప్రదాయాలు, ఇటు రష్మిక కొడవ పద్ధతులను గౌరవిస్తూ రెండు రకాలుగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఆన్-స్క్రీన్‌పై 'గీత గోవిందం'గా అలరించిన ఈ జంట, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ తోడుగా ప్రయాణం మొదలుపెట్టడం అభిమానులకు కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. 'విరోష్' పేరుతో ఈ జంటకు సోషల్ మీడియాలో భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.