Bellamkonda Sreenivas: పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. వధువు ఎవరంటే?

Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మెగా మాస్ సినిమాల కేరాఫ్ అడ్రస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు.

Update: 2026-03-06 06:40 GMT

Bellamkonda Sreenivas: పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. వధువు ఎవరంటే?

Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మెగా మాస్ సినిమాల కేరాఫ్ అడ్రస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యారు.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్చి 8వ తేదీన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం (Engagement) జరగనుంది. ఈ వేడుకను అత్యంత వైభవంగా కాకుండా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ వివాహం పూర్తిగా ప్రేమ వివాహం అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సాయి శ్రీనివాస్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెద్దల అంగీకారంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే, ఆ అమ్మాయి ఎవరు? ఆమె సినిమా రంగానికి చెందినవారా లేక బయటి వారా? అనే విషయాలను ప్రస్తుతానికి బెల్లంకొండ కుటుంబం అత్యంత గోప్యంగా ఉంచింది.

'అల్లుడు శ్రీను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, వరుస యాక్షన్ చిత్రాలతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరైన శ్రీనివాస్.. హిందీలో 'ఛత్రపతి' రీమేక్‌తో అక్కడి ప్రేక్షకులను కూడా అలరించారు. ఇప్పుడు ఆయన పెళ్లి వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వధువు వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News