Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్' కోసం పవర్ స్టార్ షాకింగ్ రెమ్యునరేషన్?
Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాకు కేవలం రూ.25 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కొంత శాతం తనకు ఇవ్వాలని ఆయన నిర్మాతలకు సూచించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్' కోసం పవర్ స్టార్ షాకింగ్ రెమ్యునరేషన్?
Pawan Kalyan Remuneration: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉస్తాద్ చిత్రానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా భారీ రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తక్కువ మొత్తంతోనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పవన్‌కు మంచి అనుబంధం ఉండటమే ఇందుకు కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దాదాపు పదేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి పవన్ సుమారు రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్ ఉంది. అయితే పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టింది. సినిమా మొదలైన తర్వాత కూడా వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది.
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాకు కేవలం రూ.25 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కొంత శాతం తనకు ఇవ్వాలని ఆయన నిర్మాతలకు సూచించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్రం విజయంపై పవన్ కళ్యాణ్ కూడా భారీ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉస్తాద్ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని సులభంగా రికవర్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఉగాది సందర్భంగా విడుదలవుతున్న ఉస్తాద్ సినిమాకు లాంగ్ వీకెండ్‌తో పాటు వరుస సెలవులు కూడా కలిసివస్తున్నాయి. సినిమాకు మంచి టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 12 రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో వేగం పెంచనున్నారు. సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.