Janhvi Kapoor: రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన జాన్వీ కపూర్..!
Janhvi Kapoor: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ మూవీ 'పెద్ది'లో అచ్చియమ్మగా జాన్వీ కపూర్ మాస్ లుక్ రివీల్! పుట్టినరోజు సందర్భంగా పెద్ది టీం జాన్వీ కపూర్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
Janhvi Kapoor: రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన జాన్వీ కపూర్..!
Peddi movie : బాలీవుడ్ స్టార్ బ్యూటీ, గ్లామరస్ క్వీన్ జాన్వీ కపూర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, ఆమె అభిమానులకు ఒక మాస్ ట్రీట్ దక్కింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం నుండి జాన్వీ పాత్రకు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
'అచ్చియమ్మ'గా సరికొత్త అవతారం
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలకే పరిమితమైన జాన్వీ, ఈ సినిమాతో పూర్తిస్థాయి పల్లెటూరి అమ్మాయిగా, అత్యంత రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. విడుదలైన వీడియోలో ఆమె చూపులు, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, అచ్చియమ్మ పాత్ర సినిమాలో ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టమవుతోంది. తన కెరీర్‌లో మొదటిసారి ఇటువంటి మాస్ రోల్ చేస్తున్న జాన్వీ, ఈ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
బుచ్చిబాబు సానా ఎమోషనల్ నోట్
దర్శకుడు బుచ్చిబాబు సానా తన ట్విట్టర్ వేదికగా జాన్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. "నీతో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్క్రీన్ మీద 'అచ్చియమ్మ'గా నీ పవర్ ఫుల్ అవతారాన్ని ప్రపంచం చూడబోతున్నందుకు నేను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను" అని ఆయన పేర్కొన్నారు. బుచ్చిబాబు మార్క్ మేకింగ్, జాన్వీ కపూర్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
భారీ అంచనాలు
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో, క్రేజీ కాంబినేషన్ రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీని వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం వీరిద్దరే కాకుండా, ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మరియు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, వేసవి కానుకగా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 'ఉప్పెన'తో తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన బుచ్చిబాబు సానా, 'పెద్ది'తో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. అచ్చియమ్మగా జాన్వీ కపూర్ ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు వేచి చూడాల్సిందే.