మాస్ హీరోగా మారనున్న లవర్ బాయ్

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో ఒకడు ఎనర్జిటిక్ హీరో రామ్ అయితే, దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయనున్నారు.

Update: 2019-01-04 07:20 GMT
Ram Pothineni

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో ఒకడు ఎనర్జిటిక్ హీరో రామ్ అయితే, దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన ఈ మధ్యనే విడుదలైంది. కాగా నిన్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్' అనే ఒక సరికొత్త టైటిల్ ను పెట్టారు. ఇక మోషన్ పోస్టర్ లో టైటిల్ లాగానే హీరో రామ్ కూడా సరికొత్త లుక్ తో అదరగొడుతున్నాడు.

నోటిలో సిగరెట్ తో మాస్ లుక్ తో కనిపిస్తున్న రామ్ ఈ సినిమాలో శంకర్ అనే పాత్రలో కనిపించనున్నాడని టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటిదాకా లవర్ బాయ్ పాత్రలో కనిపించిన రామ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మోషన్ పోస్టర్ మరియు టైటిల్ ని బట్టి ఈ సినిమా కచ్చితంగా ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతుంది అని చెప్పొచ్చు. పూరి స్వయంగా తన హోం బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.



Similar News