టైటిల్ ప్రకటించనున్న ఎనర్జిటిక్ హీరో

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రామ్ ఈ మధ్యనే విడుదలైన 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలి అన్న కసితో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయనున్నాడు.

Update: 2019-01-03 05:59 GMT
Ram Pothineni

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రామ్ ఈ మధ్యనే విడుదలైన 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలి అన్న కసితో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా రామ్ కు 17వ సినిమా గా తెరకెక్కనుంటే, పూరి జగన్నాథ్ కు ఇది 37వ సినిమా. న్యూ ఇయర్ సందర్భంగా రేపు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

ఈ సినిమా గురించి చెప్తూ ఈ సినిమాలో తాను ఒక ' బ్యాడ్ గయ్ 'పాత్రలో కనిపించనున్నానని పేర్కొన్నాడు రామ్. ఈ సినిమా బోల్డ్ అలాగే వైల్డ్ గా ఉండబోతోందని అని కూడా హింటిచ్చాడు. ఇప్పటిదాకా లవర్ బాయ్ పాత్రలో మెప్పించిన రామ్ ఇప్పుడు ఒక మాస్ పాత్రలో కనిపించనున్నాడు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాను తన హోం బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Similar News