నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెరంగేట్రం చేసింది హీరోయిన్ మెహరీన్... ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. అయితే చేసిన సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నిర్మాత జేబు ఖాలీ ఖాలీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది...
తాజాగా నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా, వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `ఎంత మంచి వాడవురా`... ఆదిత్య మూవీస్ తొలి ప్రయత్నంగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 15 న సినిమాని రిలీజ్ చేసింది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనితో నిర్మాతలకు నష్టాలని తెచ్చిపెట్టింది.
అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా మేహరీన్ నిర్మాత జేబు ఖాళీ చేసిందని, నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్ లో భాగంగా ఈ నాలుగు రోజులకు గానూ ఐదు నుంచి ఆరు డ్రెస్సులు మార్చిందట. అంతేకాకుండా స్పాకి కూడా వెళ్లడం, ఫైవ్‌స్టార్ హోటల్‌లో భోజనం వంటి వాటి కారణంగా మొత్తం 50 వేలకు మించి బల్లు అయిందని ప్రచారం సాగుతోంది.
కేవలం తన డ్రెస్సుల లాండ్రీకే 50 వేలు దాటిందని చెబుతున్నారు.ఈ మొత్తాన్ని నిర్మాత చేతే మెహరీన్ కట్టించిందట. దీంతో చేసేది లేక నిర్మాతలు ఆ మొత్తాన్ని చెల్లించినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ ఒక్క సినిమా విషయంలోనే కాకుండా అంతకు ముందు చిత్రానికి కూడా మెహరీన్ ఇలాగే చేసిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.