Malavika Mohanan: చిరుతో రొమాన్స్.. మాళవిక రియాక్షన్ ఇదే..!

Malavika Mohanan: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ అనే పుకార్లు వ్యాప్తి చెందాయి.

Update: 2025-10-30 12:07 GMT

Malavika Mohanan: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ అనే పుకార్లు వ్యాప్తి చెందాయి. మాళవిక స్వయంగా ఈ రూమర్లను ఖండించింది. తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది. చిరుతో నటించడం ఐకానిక్ అయినా నిజం లేదని చెప్పింది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ అనే పుకార్లు ఇటీవల వైరల్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మాస్టర్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక ఈ ప్రాజెక్ట్‌లో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే మాళవిక స్వయంగా స్పందించి రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేయడం తన కెరీర్‌లో ఐకానిక్ అంశమని అంగీకరించింది. కానీ ఈ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేసింది. తనను ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్తలు తనవరకు వచ్చాయని పేర్కొంది. ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. 

Tags:    

Similar News