Kanchana Re Release: బాక్సాఫీస్‌ను భయపెట్టిన 'కాంచన'.. ఈ అరాచకం ఏంది సామీ!

రాఘవ లారెన్స్ నటించిన హారర్ కామెడీ సెన్సేషన్ 'కాంచన' తాజాగా రీ-రిలీజ్ అయింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 3 రోజుల్లో రూ.5.54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Update: 2026-03-17 11:54 GMT

Kanchana Re Release: బాక్సాఫీస్‌ను భయపెట్టిన 'కాంచన'.. ఈ అరాచకం ఏంది సామీ!

Kanchana Re Release: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ ఊపు అందుకుంది. స్టార్ హీరోల క్లాసిక్ సినిమాలను అత్యాధునిక సాంకేతికతతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. 'ఖుషి', 'బిజినెస్‌మ్యాన్', 'పోకిరి', 'జల్సా', సింహాద్రి', 'మురారి', 'ఆరెంజ్', 'చెన్నకేశవ రెడ్డి', 'అతడు' వంటి చిత్రాలు రీ-రిలీజ్ మార్కెట్‌లో కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ ట్రెండ్ ద్వారా పాత చిత్రాలకు కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ నటించిన హారర్ కామెడీ సెన్సేషన్ 'కాంచన' తాజాగా రీ-రిలీజ్ అయింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మేజిక్:

దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన 'కాంచన' సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ.. మార్చి 13న ఈ చిత్రాన్ని నేటి జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా 4K రిజల్యూషన్, డాల్బీ అట్మోస్ వెర్షన్‌లో విడుదల చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు లారెన్స్ మార్క్ కామెడీ ప్రేక్షకులను మరోసారి థియేటర్లకు రప్పిస్తోంది.

రికార్డు స్థాయి ఓపెనింగ్స్:

సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు మొదటి రోజు నుంచే భారీ స్పందన రావడం విశేషం. 'కాంచన' సినిమా రీ-రిలీజ్ అయిన మొదటి రోజే రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మాస్ సెంటర్లలో ఈ సినిమాకు ఎదురులేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా మూడు రోజుల రన్ పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 3 రోజుల్లో రూ.5.54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ అయిన సినిమాల్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఒక రికార్డ్ అనే చెప్పాలి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

శరత్‌ కుమార్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ:

కేవలం స్టార్ హీరోల సినిమాలే కాదు, కంటెంట్ ఉన్న హారర్ కామెడీ సినిమాలకు కూడా రీ-రిలీజ్‌లో మంచి ఆదరణ ఉంటుందని 'కాంచన' నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇక రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2011లో 'కాంచన' వచ్చింది. ఈ చిత్రంలో లారెన్స్, శరత్‌ కుమార్, లక్ష్మీ రాయ్, కోవై సరళ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రాన్స్‌జెండర్ (హిజ్రా) పాత్రలో శరత్‌ కుమార్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Tags:    

Similar News