Sreeleela: శ్రీలీల-మహేష్ వివాదం.. అసలేం జరిగిందంటే..?
Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో శ్రీలీల తనను అవమానించిందంటూ వస్తున్న వార్తలపై జబర్దస్త్ మహేష్ క్లారిటీ ఇచ్చారు.
Sreeleela: శ్రీలీల-మహేష్ వివాదం.. అసలేం జరిగిందంటే..?
Sreeleela vs Jabardasth Mahesh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో, మేకర్స్ నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో పవన్ కల్యాణ్ స్పీచ్ ఎంత వైరల్ అయిందో, ఒక చిన్న వీడియో క్లిప్ కూడా అంతే స్థాయిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో.. స్టేజీపై హీరోయిన్ శ్రీలీల ముందు నిలబడి ఉండగా, ఆమె వెనుకనే జబర్దస్త్ ఫేమ్ మహేష్ నిలబడి ఉన్నాడు. ఒక సందర్భంలో శ్రీలీల వెనక్కి తిరిగి చూసింది. ఆ సమయంలో మహేష్.. ఆమె తన వైపు చూస్తుందనుకొని నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేశాడు. కానీ శ్రీలీల అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా, చాలా సీరియస్ లుక్‌తో ముందుకు తిరిగిపోయింది. ఈ చిన్న క్లిప్‌ను పట్టుకున్న నెటిజన్లు.. "శ్రీలీల అహంకారం చూశారా? తోటి నటుడిని అంతలా అవమానిస్తారా?" అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ట్రోల్స్‌కు చెక్ పెట్టిన మహేష్
ఈ వివాదం ముదురుతుండటంతో, జబర్దస్త్ మహేష్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరిస్తూ మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు. శ్రీలీల గారు నన్ను అవమానించలేదు. అసలు విషయం ఏంటంటే.. ఈవెంట్ సమయంలో శ్రీలీల తన ఫోన్ పట్టుకోమని నా దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సడన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఫోన్ కోసం నా వైపు చూస్తున్నారేమో అనుకొని నేను ఆమె వైపు చూసి నవ్వాను. కానీ ఆవిడ తన ఫోన్ కోసం కాకుండా పైన ఉన్న స్క్రీన్ వైపు చూశారు. అంతే జరిగింది. ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరవపరచలేదు అని మహేష్ స్పష్టం చేశారు.
అతిగా స్పందిస్తున్న సోషల్ మీడియా
ఒక్కోసారి కెమెరా యాంగిల్స్ వల్ల లేదా సందర్భం తెలియకపోవడం వల్ల ఇలాంటి అపార్థాలు జరుగుతుంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. శ్రీలీల వంటి సెన్సేషనల్ హీరోయిన్ ఒక కమెడియన్‌ను కావాలని అవమానిస్తుందని భావించడం సరికాదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఏది ఏమైనా, చిన్న చిన్న వివాదాల కంటే సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న థియేటర్లలో భగత్ సింగ్ 'ధమ్కీ' మొదలుకానుంది.