Prabhas Movies: ప్రభాస్‌ను హ్యాండిల్ చేయనున్న ముగ్గురు ఊహించని డైరెక్టర్లు!

Prabhas Movies: ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'తో మూడు సినిమాల భారీ డీల్

Update: 2026-03-16 14:36 GMT

Prabhas Movies

Prabhas Movies: 'రెబల్ స్టార్' ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2', 'సలార్ 2' వంటి భారీ చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'తో మూడు సినిమాల భారీ డీల్ కుదుర్చుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి దర్శకుల వివరాలు, తాజా అప్‌డేట్స్ ఏంటో ఓసారి చూద్దాం.

సలార్ 2: సౌర్యాంగపర్వం:

హోంబలే ఫిల్మ్స్ - ప్రభాస్ కాంబోలో వచ్చే మొదటి చిత్రం 'సలార్ 2'. బ్లాక్ బస్టర్ హిట్ 'సలార్: సీజ్‌ఫైర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మలయాళ డైరెక్టర్‌తో ప్రయోగాత్మక చిత్రం:

హోంబలే ఫిల్మ్స్ ఒప్పందంలో భాగంగా రెండో సినిమాకు మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యథాన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. 'కిష్కింధకాండ', 'ఏకో' వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దింజిత్.. ఇటీవల ప్రభాస్‌ను కలిసి కథ వినిపించారని సమాచారం. వీరిద్దరి కాంబోలో ఒక వైవిధ్యభరితమైన యాక్షన్ థ్రిల్లర్ వచ్చే అవకాశం ఉంది.

'అమరన్' దర్శకుడితో క్రేజీ ప్రాజెక్ట్:

మూడో సినిమా కోసం తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి పేరు పరిశీలనలో ఉంది. శివకార్తికేయన్ హీరోగా 'అమరన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్.. ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ లైన్ సిద్ధం చేశారట. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

సెన్సేషనల్ హిట్స్:

ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రానప్పటికీ.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు దర్శకులు హోంబలే సంస్థలో ప్రభాస్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఒకవైపు ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడు, మరోవైపు దింజిత్, రాజ్‌కుమార్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో ప్రభాస్ చేస్తున్న ఈ ప్లానింగ్ చూస్తుంటే.. రాబోయే కాలంలో డార్లింగ్ నుంచి మరిన్ని సెన్సేషనల్ హిట్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News