Tamannaah Bhatia: తమన్నాకు పబ్లిక్‌గా ముద్దు పెట్టిన అభిమాని.. తర్వాత ఏం జరిగిందంటే..?

Tamannaah Bhatia: చెన్నైలోని వెల్ టెక్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తమన్నా భాటియాకు వింత అనుభవం ఎదురైంది. ఒక లేడీ ఫ్యాన్ స్టేజ్ పైనే ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టడంతో తమన్నా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Update: 2026-03-15 07:27 GMT

Tamannaah Bhatia: తమన్నాకు పబ్లిక్‌గా ముద్దు పెట్టిన అభిమాని.. తర్వాత ఏం జరిగిందంటే..?

Tamannaah Bhatia: ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలకు పబ్లిక్ ఈవెంట్లలో చేదు అనుభవాలు ఎదురవ్వడం పరిపాటిగా మారింది. అభిమానం పేరుతో కొందరు హద్దులు మీరుతుంటే, మరికొందరు అనుచిత ప్రవర్తనతో నటీమణులను ఇబ్బంది పెడుతున్నారు. అయితే, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ఒక వింతైన, ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రముఖ వెల్ టెక్ యూనివర్సిటీలో జరిగిన ఒక వేడుకకు తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిల్కీ బ్యూటీని చూడగానే అక్కడి విద్యార్థుల ఉత్సాహం అంబరాన్నంటింది. తమన్నా కూడా ఎంతో సరదాగా విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు. అయితే, ఈ క్రమంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. తమన్నాను కలవడానికి స్టేజ్ పైకి వచ్చిన కొంతమంది లేడీ ఫ్యాన్స్ ఆమెను ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. అంతవరకు బానే ఉన్నా, అందులో ఒక యువతి అత్యుత్సాహంతో, ఎమోషన్ ఆపుకోలేక తమన్నా బుగ్గపై ముద్దు పెట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో తమన్నా షాక్‌కు గురైంది.

అసౌకర్యంగా ఉన్నా.. హుందాగా

అపరిచిత వ్యక్తులు అంత దగ్గరకు వచ్చి అలా ప్రవర్తించడంతో తమన్నా ఒకింత అసౌకర్యానికి గురైనట్లు ఆమె ముఖకవళికలు చూస్తే అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా కోప్పడతారు లేదా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ, తమన్నా మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. ఆశ్చర్యం నుండి తేరుకుని, వెంటనే చిరునవ్వుతో ఆ అభిమానిని పలకరించి, కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆమె ప్రదర్శించిన ఈ సహనం ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.

నెటిజన్ల మధ్య యుద్ధం

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు సెల్ఫీ ఇవ్వడానికే అహంకారం ప్రదర్శిస్తారు. అలాంటిది అంతటి స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా, అభిమాని అలా ప్రవర్తించినా కోప్పడకుండా నవ్వుతూ ఉన్న తమన్నా మనసు వెన్న అంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అభిమానం ఉంటే ఫోటో దిగాలి కానీ, ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసేలా ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం సరైన పద్ధతి కాదు అని మరికొందరు హితవు పలుకుతున్నారు.ఇంకొందరు మాత్రం, "అది కేవలం ఒక ఆడపిల్ల తన అభిమాన నటిపై చూపించిన ప్రేమ మాత్రమే. దీన్ని భూతద్దంలో పెట్టి చూసి, బూతులు వెతకాల్సిన అవసరం లేదు" అంటూ విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

ఈ ఘటన తమన్నా మంచితనాన్ని చాటిచెప్పినప్పటికీ, పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీల భద్రతపై మళ్ళీ చర్చ మొదలైంది. గతంలో పలువురు హీరోయిన్లకు పబ్లిక్ లో వేధింపులు ఎదురైన సంఘటనలు ఉన్న నేపథ్యంలో, అభిమానులు కూడా తమ పరిమితులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, మిల్కీ బ్యూటీ తన క్లాస్ బిహేవియర్ తో మరోసారి అందరి మనసు గెలుచుకుంది.



Tags:    

Similar News