AA26xA6 Movie: రాజమౌళి, శంకర్ వల్లే కాలేదు.. ఆ విషయంలో అల్లు అర్జున్, అట్లీ తోపు!
AA26xA6 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ మాత్రం ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు.
AA26xA6 Movie: రాజమౌళి, శంకర్ వల్లే కాలేదు.. ఆ విషయంలో అల్లు అర్జున్, అట్లీ తోపు!
AA26xA6 Movie: ప్రస్తుత డిజిటల్ కాలంలో ఒక పెద్ద సినిమాకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వకుండా ఉండటం దాదాపు అసాధ్యం. దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ శంకర్ సైతం లీకులను అరికట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ మాత్రం ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు.
అత్యంత రహస్యంగా షూటింగ్:
సాధారణంగా ఏ పెద్ద సినిమా షూటింగ్ మొదలైనా సెట్స్ నుంచి ఫోటోలు రావడం లేదా టైటిల్ లీక్ అవ్వడం సర్వసాధారణం. కానీ అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి ఇప్పటివరకు ఒక్క చిన్న హింట్ కూడా బయటకు రాకపోవడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చిత్ర యూనిట్ తీసుకుంటున్న కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఇందుకు ప్రధాన కారణం. షూటింగ్ స్పాట్‌లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారట. సినిమా జోనర్ ఏంటి?, కథాంశం ఏమిటి? అనే విషయాలను కూడా బయటకు రానివ్వకుండా మేనేజ్ చేస్తున్నారు. నేటి కాలంలో కంటెంట్‌ను ఇంతలా కాపాడటం చిత్ర యూనిట్ పనితీరుకు నిదర్శనం.
ఏప్రిల్ 8న అసలైన 'ట్రీట్':
అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌కు సమయం ఆసన్నమైంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైందని సమాచారం. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్, అట్లీ పక్కా మాస్ టేకింగ్ కలగలిస్తే.. వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
టీమ్ సక్సెస్:
లీకులకు తావులేకుండా ఒక భారీ ప్రాజెక్టును నడిపించడం అల్లు అర్జున్ - అట్లీ టీమ్ సక్సెస్ అనే చెప్పాలి. ఏప్రిల్ 8న రాబోయే అప్‌డేట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ‘AA22’గా ఈసినిమా ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పేరు ఇప్పటికే ఖరారైంది. దీపికానే మెయిన్ లీడ్ రోల్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఈ భారీ ప్రాజెక్ట్ చేస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.