Ustaad Bhagat Singh: దుమ్ములేపుతున్న 'ధురంధర్'.. మరి 'ఉస్తాద్' పరిస్థితేంటి?

Ustaad Bhagat Singh: మార్చి 19న విడుదల కానున్న రణవీర్ సింగ్ ధురంధర్ 2, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై భారీ అంచనాలు. ప్రీమియర్ షోలకే ధురంధర్ 2కు హౌస్‌ఫుల్ బుకింగ్స్.

Update: 2026-03-14 09:30 GMT

Ustaad Bhagat Singh: దుమ్ములేపుతున్న 'ధురంధర్'.. మరి 'ఉస్తాద్' పరిస్థితేంటి?

Ustaad Bhagat Singh: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టి మార్చి 19 పైనే ఉంది. ఆ రోజు విడుదల కాబోతున్న బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2', 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలే అందుకు కారణం. నిజం చెప్పాలంటే.. ఈ రెండు సినిమాల మధ్య అసలు పోటీయే లేదు. ఎందుకంటే ధురంధర్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ప్రాంతీయ చిత్రంగా తెలుగు రాష్ట్రాల్లోనే విడుదలవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లలోకి వస్తుందంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. అయితే పవన్ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ.. ధురంధర్ 2 క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. పాన్ ఇండియా అప్పీల్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ ఆసక్తిని చూపిస్తున్నారు. సినిమా విడుదల మార్చి 19న అయినప్పటికీ.. ఒకరోజు ముందుగానే (మార్చి 18న) భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి:

ఏఎంబీ సినిమాస్ లాంటి ప్రీమియం మల్టీప్లెక్స్‌లో ధురంధర్ 2 అన్ని షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనూ బుకింగ్స్ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో కూడా ఎక్కడ చూసినా.. హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఒకవైపు ధురంధర్ 2 ప్రీమియర్స్‌తో సందడి చేస్తుంటే.. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. అంతేకాకుండా ఉస్తాద్ షోలు మార్చి 19 తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానున్నాయి. ధురంధర్ లాగా ముందే ప్రీమియర్స్ లేకపోవడం పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమా పోటీలో ఉన్నప్పటికీ.. బాలీవడ్ మూవీ ధురంధర్ 2 ఈ స్థాయి రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రీమియర్స్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే.. ఇక సినిమాకు ఎలా ఉంటుందో. ఒకవేళ ధురంధర్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ధురంధర్ ఇప్పటికే రికార్డులను చెరిపేసి విషయం తెలిసిందే.

Tags:    

Similar News