Anasuya: అనసూయను వేధించింది మరెవరో కాదు ఇతనే..!

Anasuya: నటి అనసూయను టార్గెట్ చేసి మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, మరో సినీ నటిని వేధించిన కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2026-03-14 04:28 GMT

Anasuya: అనసూయను వేధించింది మరెవరో కాదు ఇతనే..!

Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో 'లైక్స్', 'వ్యూస్', 'ఫాలోవర్స్' కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్న నేటి కాలంలో, సినీ తారల వ్యక్తిగత జీవితాలు, ప్రతిష్ట ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ, వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వేధింపుల కేసులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అనసూయను టార్గెట్ చేసిన సైబర్

కొంతకాలంగా స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా నకిలీ వీడియోలను సృష్టించడం సంచలనంగా మారింది. ఈ వేధింపులపై అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, ఏపీలోని కడప జిల్లా పులివెందులకు చెందిన జనార్దన్ అనే వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో నివాసముంటున్న ఈ నిందితుడు, కేవలం తన సోషల్ మీడియా ఖాతాలకు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు రావాలనే దురుద్దేశంతో అనసూయ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. నిందితుడి నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరో సినీ నటి కేసులోనూ అరెస్టులు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఒక్క అనసూయతోనే ఆగిపోలేదు. మరో సినీ నటిని ఉద్దేశించి యూట్యూబ్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లికి చెందిన అరుణ్ కుమార్ అనే ఆటో డ్రైవర్, సదరు నటి పోస్ట్ చేసిన రీల్స్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. ఆమె ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

సైబర్ పోలీసుల హెచ్చరిక

సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉన్న వేదిక కావొచ్చు, కానీ అది మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కాదు" అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వ్యూస్ కోసం, ఫాలోయింగ్ కోసం ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా సెలబ్రిటీల పట్ల జరుగుతున్న ట్రోలింగ్, వేధింపుల నేపథ్యంలో ఇటువంటి అరెస్టులు సైబర్ నేరగాళ్లకు గట్టి హెచ్చరికగా మారుతున్నాయి.

Tags:    

Similar News