Peddi: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' వేట మొదలు..ఇక డాల్బీలో పూనకాలే..!
Peddi: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్! ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Peddi: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' వేట మొదలు..ఇక డాల్బీలో పూనకాలే..!
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా విడుదలవుతున్న అప్‌డేట్స్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది.
డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో 'పెద్ది'
సాధారణంగా భారీ యాక్షన్ చిత్రాలకు సౌండ్ మరియు విజువల్ క్వాలిటీ ప్రాణం. అందుకే ‘పెద్ది’ మేకర్స్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాను అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతిలో బ్యాట్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్‌తో ఉన్న రామ్ చరణ్ రగ్గడ్ అవతార్ చూస్తుంటే.. థియేటర్లలో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది.
మ్యూజికల్ సెన్సేషన్: రెహమాన్ మ్యాజిక్
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా వచ్చిన ‘రైరై రా రా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మాస్ బీట్స్ మరియు ఎమోషనల్ ట్యూన్స్‌తో రెహమాన్ తన మార్క్ చూపిస్తున్నారు. టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్. రత్నవేలు ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారుగ్రామీణ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో చరణ్ మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.