Harish Shankar: పోయి పోయి మహేష్ బాబు అభిమానులతోనే పెట్టుకున్నాడే..!

Harish Shankar: సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులపై హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. పరిస్థితి చేయి దాటడంతో హరీష్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఫ్యాన్స్ తగ్గడం లేదు.

Update: 2026-03-12 03:28 GMT

Harish Shankar: పోయి పోయి మహేష్ బాబు అభిమానులతోనే పెట్టుకున్నాడే..!

 Mahesh Babu Fans: టాలీవుడ్ యాటిట్యూడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన మార్కు డైలాగులతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే ఈ డైరెక్టర్, రియల్ లైఫ్‌లో తన నోటి దూల వల్లే తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ మరో 10 రోజుల్లో ఉందనగా, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను కెలికి కొరివితో తల గోక్కున్న పరిస్థితి తెచ్చుకున్నారు.

అసలేం జరిగింది?

వివాదం అంతా ఒక ట్వీట్ చుట్టూ తిరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రికార్డుల గురించి రాస్తూ.. ఒక నెటిజన్ మహేష్ బాబు రికార్డులను కించపరిచేలా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను సరిగ్గా గమనించకుండానే హరీష్ శంకర్ ‘తథాస్తు’ అని రిట్వీట్ చేయడం ఇప్పుడు పెను దుమారాన్ని రేపింది. అది గమనించిన మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

హరీష్ వివరణ: బిజీగా ఉండి చూడలేదా?

పరిస్థితి విషమించడంతో హరీష్ శంకర్ వెంటనే రంగంలోకి దిగారు. తన తప్పును ఒప్పుకుంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.నిన్న సెన్సార్ బోర్డ్ మీటింగ్, అమ్మవారి దర్శనం, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులతో చాలా బిజీగా ఉన్నాను. ఆ హడావిడిలో అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ, ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే రిట్వీట్ చేశాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.అంతేకాకుండా, మహేష్ బాబు అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన రాజమౌళి సినిమాతో ప్రపంచ స్థాయి రికార్డులు సృష్టిస్తారని రాసుకొచ్చారు.

క్షమించని సూపర్ స్టార్ ఫ్యాన్స్

హరీష్ క్షమాపణలు చెప్పినప్పటికీ, మహేష్ అభిమానులు మాత్రం శాంతించడం లేదు. ట్వీట్ చదవకుండానే 'తథాస్తు' అనేంత గుడ్డి వాడివా? అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. గతంలో కూడా హరీష్ శంకర్ పలు సందర్భాల్లో ఇతరులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ.. నీకు నోటి దూల ఎక్కువ అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.

సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్?

ఈ వివాదం అక్కడితో ఆగకుండా ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై పడింది. మహేష్ అభిమానులు నేషనల్ వైడ్‌గా సినిమాకు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి వివాదం రావడం ఖచ్చితంగా చిత్ర యూనిట్‌ను కలవరపెట్టే విషయమే. హరీష్ శంకర్ హడావిడి పవన్ కళ్యాణ్ సినిమాకు ఎక్కడ సెగ తగిలిస్తుందో అని మెగా అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి, తన క్షమాపణలతో హరీష్ శంకర్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News